దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా దూరంగా ఉండాలని నిర్ణయించింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాల్సిందేనని కాంగ్రెస్ శ్రేణుల నుంచి డిమాండ్లు వస్తున్నప్పటికీ రాష్ర్ట ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైఎస్ చనిపోయిన తొలి ఏడాది మాత్రమే ప్రభుత్వం జయంతి వేడుకలు నిర్వహించింది. అప్పటి సీఎం రోశయ్య అన్ని జిల్లాల్లో వైఎస్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి వైఎస్ చేసిన సేవలకు గుర్తుగా నెక్లెస్ రోడ్డులో రూ.15 కోట్ల వ్యయంతో వైఎస్సార్ మెమోరియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైఎస్ అకాల మరణం చెందిన నల్లకాలువ వద్ద ‘వైఎస్ స్మృతివనం’ నిర్మిస్తామని, ఇడుపులపాయలోని వైఎస్ సమాధి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కూడా ప్రకటించారు.
అయితే మూడేళ్లు కావొస్తున్నా వీటిలో ఏ ఒక్క పథకం పనులు ప్రారంభం కాలేదు. తాజాగా వైఎస్ జయంతి వేడుకలకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం దూరంగా ఉంటోంది. అయితే కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు రాకుండా ఉండేందుకు పార్టీపరంగా వైఎస్ జయంతి కార్యక్రమాలను నామమాత్రంగా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఆదివారం ఉదయం పంజగుట్టలోని వైఎస్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఉదయం 10.30 గంటలకు సీఎల్పీ కార్యాలయంలో, 11 గంటలకు గాంధీభవన్‌లో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు.

No comments:
Post a Comment