ఢిల్లీ: రేపు ఉదయం 11: 30 గంటలకు వైఎస్సార్‌సిపి ప్రతినిధుల బృందం ప‌్రధాని మన్మోహన్ సింగ్ తో భేటీ కానుంది. సౌత్ బ్లాక్‌లోని ఛాంబర్‌లో ప్రధానితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ భేటీ కానున్నారు. ఈ భేటీలో ఎంపీలు మేకపాటి, సబ్బంహరి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, సుచరిత,పిల్లి సుభాష్ చంద్రబోస్,మైసూరారెడ్డి తదితరులు పాల్గొంటారు. క్విడ్‌ప్రోకో కేసులో సీబీఐ పక్షపాత ధోరణిపై, రైతాంగ సమస్యల్ని వైఎస్ విజయమ్మ ప్రధాని దృష్టికి తేనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment