వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. విచారణ ముమ్మరంగా జరుగుతున్న సమయంలో బెయిల్ మంజూరు చేయలేమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు తన తీర్పులో పేర్కొన్నారు.
జగన్ కు బెయిల్ మంజూరు చేస్తే... తదుపరి దర్యాప్తునకు భంగం కలగదని నిర్థారించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని ధ్రువీకరించే ఆధారాలేవి సీబీఐ చూపలేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ దర్యాప్తు పూర్తయ్యేంత వరకూ బెయిల్ ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
జూన్ 21న బెయిల్ కోసం హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 27, 28న ఈ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆయన తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలాని, సీబీఐ తరపున సీనియర్ న్యాయవాది అశోక్ భాన్ వాదించారు.
కోర్టు సమన్లు జారీ చేసిన వ్యక్తిని అరెస్టు చేయడం కోర్టు ధిక్కారంగా పరిగణించాలని జగన్ తరపున వాదించిన రాంజెఠ్మాలనీ హైకోర్టు దృష్టికి తెచ్చారు. తప్పుడు పత్రాలతో సీబీఐ కోర్టును తప్పుదోవ పట్టించిందని ఆయన వాదించారు. కోర్టు సమన్ల జారీ చేసిన జగన్‌ను విచారణ పేరుతో పిలిచి సీబీఐ మే 27 ఆదివారం సాయంత్రం అరెస్టు చేసింది.

No comments:
Post a Comment