కీలక నిందితుడు యాదగిరిని ఎలా వదిలేశారు?
స్టేట్‌మెంట్ రికార్డు చే సుకునే వరకు నగరంలోనే దర్జాగా ఉన్న యాదగిరి
కే సు ఏసీబీకి వెళ్లగానే మాయమవడం వెనుక మతలబేంటి?
ఏసీబీకి పూర్తి వివరాలు అందించడంలో జాప్యం వెనుక ఆంతర్యం ఏంటి?
హైదరాబాద్, న్యూస్‌లైన్: జడ్జి పట్టాభి రామారావు ముడుపుల కేసును తొలుత విచారించిన సీబీఐ అధికారులు కీలక విషయాలను మరుగుపరచడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న నాచారం రౌడీషీటర్ యాదగిరిరావును సీబీఐ అధికారులు విచారించి వదిలివేయడం వెనుక అసలు మతలబు ఏమిటనేదీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. జడ్జి ముడుపుల వ్యవహారంలో గత నెల 23వ తేదీనే సీబీఐకి కచ్చితమైన సమాచారం వచ్చినప్పటికీ వారం రోజుల తర్వాత ఆ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. కడప పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు వచ్చిన సమయంలోనే పట్టాభి ముడుపుల వ్యవహారం వెలుగుచూడటం వెనుక ప్రణాళిక ఏమిటన్నది ఇట్టే తెలిసిపోయింది. ఈ కేసులో కీలక నిందితుడు యాదగిరిరావును సీబీఐ వదిలివేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జడ్జి ముడుపులపై గత నెల 23న సమాచారం అందిన తర్వాత సీబీఐ అధికారులు విచారణ జరిపి హైకోర్టుకు నివేదిక అందించారు. అనంతరం ఈ కేసులో కీలక పాత్ర పోషించిన రౌడీషీటర్ యాద గిరిరావును 27న విచారించారు. అతడి నుంచి స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేశారు.
ఈ ముడుపుల వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన యాదగిరిరావుకు రూ.9.5 లక్షలు ముట్టినట్లుగా కూడా సీబీఐకి సమాచారం అందింది. అత డిని అదుపులోకి తీసుకుని విచారించిన సీబీఐ అధికారులు... అతని నుంచి ఆ నగదును మాత్రం స్వాధీనం చేసుకోలేదు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదయ్యే కేసుల్లో డబ్బు స్వాధీనం చేసుకోవడాన్నే కోర్టు ప్రధానమైన సాక్ష్యంగా పరిగణిస్తుంది. ఉద్దేశపూర్వకంగా యాదగిరిరావు నుంచి సీబీఐ అధికారులు డబ్బును స్వాధీనం చేసుకోలేదా... అందుకు మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న అనంతరం కీలక నిందితుడిగా ఉన్న యాదగిరిని దర్జాగా ఇంటికి ఎందుకు పంపించార న్నది కూడా అంతుచిక్కని ప్రశ్నగా ఉంది.
యాదగిరిరావు నుంచి సీబీఐ రికార్డు చేసిన స్టేట్‌మెంట్‌లోనూ పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయి. గాలి జనార్దనరెడ్డి బంధువులకు రిటైర్డు జడ్జి చలపతిరావును యాదగిరే పరిచయం చేసినట్లు మొదట పేర్కొన్నారు. మరోచోట మాత్రం గాలి జనార్దనరెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి, చలపతిరావు కొన్ని అంశాలను పరస్పరం చర్చించుకుంటుండగా యాదగిరి చూసినట్లుగా వివరించారు. ఒకవేళ చలపతిరావుకు గాలి బంధువులతో అంతకుముందే మాట్లాడుకునేంత పరిచయం ఉండి ఉంటే... మరి యాదగిరిరావు ఎందుకు పరిచయం చేయాల్సి వచ్చిందన్నది అర్థంగాకుండా ఉంది. సీబీఐ అదనపు ఎస్పీ స్థాయి అధికారి రికార్డు చేసిన ఈ స్టేట్‌మెంట్ విషయంలో ఇలా పరస్పర విరుద్ధమైన అంశాలు ఎలా ఉన్నాయనేది తేలాల్సి ఉంది. సీబీఐ అధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం అందించకుండా జాప్యం చేస్తుండటం గమనార్హం.
ఏసీబీ రంగంలోకి దిగాకే యాదగిరి పరారీ..
సీబీఐ అధికారులు గతనెల 23 నుంచి జడ్జి ముడుపుల వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నప్పటికీ యాదగిరిరావు రాజధాని నగరంలోనే ఉన్నాడు. అతడి నుంచి సీబీఐ అధికారులు స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తర్వాత కూడా తన ఇంటిలోనూ ఉన్నాడు. ఏసీబీ అధికారులు ఈనెల 9న కేసు నమోదు చేసిన మరుక్షణమే యాదగిరిరావు కనిపించకుండా పరారైనట్లు అధికారులు గుర్తించారు.
సీబీఐ దర్యాప్తు జరుగుతున్న సుమారు 16 రోజులపాటు యాదగిరిరావు నిర్భయంగా ఇక్కడే తిరగడం వెనుక ఉన్న ధీమా ఏమిటన్నది కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న రిటైర్డు జడ్జి చలపతిరావు వద్ద బ్యాంక్ లాకర్ కీ వివరాలను సీబీఐ అధికారులు అడిగి తెలుసుకున్నప్పటికీ ఆయన ఇంట్లో మాత్రం సోదాలు నిర్వహించలేదు. జడ్జి పట్టాభి రామారావు కుమారుడు రవిచంద్ర వద్ద ఐదు లాకర్ కీలను సీజ్‌చేశారు. వారి ఇంట్లో కూడా ఎలాంటి సోదాలూ జరపలేదు. కేసు దర్యాప్తు ప్రారంభమైన నేపథ్యంలో కొన్ని ఆధారాలను మాయం చేసే అవకాశం ఉన్నట్లు తెలిసినా సీబీఐ ఎందుకు మిన్నకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

No comments:
Post a Comment