వైఎస్ ధైర్యసాహసాలే రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించాయి: సోమయాజులు
వైఎస్ కుటుంబంపై దుష్ర్పచారాన్ని మేధావులంతా అడ్డుకోవాలి: శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళ్తామని పలువురు ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యావంతులు ఉద్ఘాటించారు. ఆదివారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాల యంలో ‘లీడర్‌షిప్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ పేరిట సమావేశం జరి గింది. వివిధ కళాశాలలకు చెందిన దాదాపు 200 మందికిపైగా అధ్యాపకులు ఇందులో పాల్గొన్నారు. పార్టీలో చేరడానికి వచ్చి న ప్రొఫెసర్లకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ధైర్య సాహసాలే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాయని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డి.ఎ.సోమయాజులు ఈ సం దర్భంగా పేర్కొన్నారు. ఆయన తీసుకున్న ప్రతి చర్యా ప్రజల బాగోగుల కోసమేనన్నారు.
రాష్ట్రంలో వైఎస్ ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని చెప్పారు. వైఎస్‌లో ఉండే డేరింగ్ అండ్ డైనమిజం జగన్‌లోనూ ఉన్నాయన్నారు. పేదలకు మంచి చేయాలనే తపన, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే లక్ష్యంతో ముందుకెళ్లిన నాయకుడు దివంగత సీఎం వైఎస్సార్ అని శ్రీకాంత్‌రెడ్డి కొనియాడారు. ఆయన అయిదేళ్ల పాలనలో ఎలాంటి పన్నులు పెంచకపోగా పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకు సువర్ణయుగం అందించారని ప్రశంసించారు. అందుకే వైఎస్ ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన మరణం తర్వాత రాష్ట్రానికి నాయకత్వలోపం ఏర్పడినందునే నిత్యం జనం మధ్య ఉంటూ వారిలో ఒకరిలా కలిసిపోయిన జగన్ వైపు రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కులాలు, మతాలను ఎంతగా విడదీయాలని ప్రయత్నించినా వారి ఎత్తులు పారలేదన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 50వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమన్నారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, టీడీపీలు కుట్ర చేసి ఆయ న్ను అనవసరంగా జైల్లో బంధించారని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. జగన్‌పైనా, వైఎస్ కుటుంబంపైనా జరుగుతున్న దుష్ర్పచారాన్ని మేధావులంతా ఏకమై అడ్డుకోవాలని సూచించారు. పార్టీ కోశాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు వైఎస్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని స్మరించుకున్నారు. ప్రొఫెసర్ బెత్తంపూడి ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్, పార్టీ నేతలు గురువారెడ్డి, వరప్రసాదరెడ్డి తదితరులు ప్రసంగించారు.

No comments:
Post a Comment