హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగనుంది. డీజిల్ ధర పెంపు, సిలెండర్ల కోత, రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఈ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ నెల 20న నిరసనలు, రాస్తారోకోలు, హర్తాళ్లు చేపట్టాలని ప్రజలకు పిలుపు ఇచ్చింది. ప్రజా వ్యతిరేక చర్యలను తక్షణం ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. యూపీఏ వైఖరి వల్ల కోట్లాది మంది సామాన్యులపై మరింత భారం పడుతుందని పార్టీ తెలిపింది.
source:
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=452975&Categoryid=14&subcatid=0
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment