రాష్ట్ర ప్రభుత్వం ఇంటెన్సివ్ కేర్‌లో ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి విమర్శించారు. కేసీకెనాల్‌కు నీరు విడుదల చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దువ్వూరు నుంచి కడప వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో మైసూరా మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందన్నారు. ప్రజలంతా ఏకమై ప్రభుత్వాన్ని నిద్ర లేపాలన్నారు.
కేసీ కెనాల్ ఈఈ నీరు విడుదల చేస్తున్నట్లు చెప్పడంతో రైతులు వరి సాగు చేశారన్నారు. ఈఈ చెబితే ప్రభుత్వం చెప్పినట్లేనని... అయితే మంత్రి డీఎల్‌కు తెలీకుండా నీటి విడుదలపై ఈఈ ప్రకటించడంతో దాన్ని సహించలేని ఆయన కేసీ కెనాల్‌కు నీటి విడుదలను అడ్డుకున్నారన్నారు. కేసీకెనాల్ పరిధిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఐదుగరు మంత్రులు వున్నప్పటికీ ముఖ్యమంత్రిని ఒత్తిడి చేసి నీటి విడుదలకు కృషి చేయలేదన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రాంత విభేదాలు తలెత్తుతున్నాయన్నారు. ధర్నాలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు రఘురామిరెడ్డి, సురేష్‌బాబు, అవినాష్్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment