కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వారు మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఇంతవరకూ ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ రాలేదన్నారు.
రైతులు రోడ్డున పడే దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో విద్యుత్ సంక్షోభంపై చర్చ సమయంలో కుట్రపూరితంగా సభను వాయిదా వేశారని వారు ఆరోపించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని ఎమ్మెల్యేలు విమర్శించారు.

No comments:
Post a Comment