ఎంఐఎం పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటూ వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని విజయమ్మతో అసదుద్దీన్ పంచుకున్నారు.
ప్రజా సమస్యలకు వైఎస్ తక్షణం పరిష్కారం చూపేవారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కుటుంబం అంటే తమకెంతో గౌరవమని అసుదుద్దీన్ కొనియాడారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తరచుగా తాను వైఎస్సార్ తో సమావేశమయ్యేవాడినని ఇప్పుడు వైఎస్ విజయమ్మకూడా ప్రజాసమస్యలపై పోరాడుతున్నారని అసదుద్దీన్ అన్నారు.

No comments:
Post a Comment