ప్రభుత్వం వెంటనే కరువు మండలాలు ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు డిమాండ్ చేశారు. శాసనమండలిలో ఈరోజు కరువు పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మేకా మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో గ్రామాల్లో కరువును ఎదుర్కోవాలన్నారు. వైఎస్ఆర్ గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని కరువు నివారణ చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. పంటల బీమా ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనన్నారు. కులవృత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకోలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment