గ్యాస్ సిలిండర్ల పరిమితి ...డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి సైకిల్ రిక్షాల మీద శాసనసభకు చేరుకున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎడ్లబండిపై అసెంబ్లీకి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా హజరయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment