నందమూరి వారిని నట్టేట ముంచడం ’నారా‘వారికే సాధ్యం. మహానటుడు ఎన్టీఆర్ ను నమ్మించి వంచించిన ఘనత ’నారా‘కే దక్కిందని చెప్పకతప్పదు. పిల్లనిచ్చిన మామపై మాయా రాజకీయం ప్రయోగించడం తెలుగుదేశంలో పరిపాటే. ఎన్టీఆర్ ను రోడ్లపాలు చేసిన ఖ్యాతి ఎవరిదో అందరికీ విధితమే. పార్టీ వ్యవస్థాపకుడినే నా నా అవస్థలపాలు చేసిన నాయుడుగారు తెలుగుదేశంలో మరో ప్రయోగానికి తెరతీశారు. బాలయ్యకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి లోకయ్యను సహాయకునిగా నియమించనున్నారు. మరి లోకయ్య తన మామ బాలయ్యను ముంచిన అల్లుడవుతాడా? పితృదేవుడు ‘నారా’ నేర్పిన రాజకీయ పాఠాలు బాలయ్యబాబుకూ అప్పజెపుతాడా? పిల్లనిచ్చిన పాపానికి పదవి పోతే పోయింది కానీ పరువుపోతే ఇంకేమైనా ఉందా..? అవశానదశలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కొత్త రక్తం కావాలని నాయుడుగారు తలచారు. ఇతరులకు అప్పగిస్తే పార్టీని ఇట్టే ఎగురేసుకుపోతారని భావించినట్టున్నాడు. ‘దేశం’ వారసుడు బాలయ్యను బరిలోకి దింపేందుకు అక్టోబర్ 2న ముహుర్తం ఖరారు చేశాడు. కాగా వియ్యంకుడైన బాలయ్యకు చేదోడువాదోడుగా తన వారసుడైన లోకేష్ బాబును నియమించడంలో నిమగ్నమైయ్యారు. దీంతో తెలుగుదేశంలో మళ్ళీ మామా అల్లుళ్ళ శకం ప్రారంభం కానుందనే చెప్పాలి. జనాభిమానం గల బాలయ్యకు పార్టీ పగ్గాలు అందించి ధనాభిమానం గల లోకేష్ కు సైతం కీలక బాధ్యతలు అప్పగిస్తే తన భాధ్యత తీరినట్టేనని ‘బాబు’ దృఢనిశ్చయానికి వచ్చేశాడు. తెలుగుదేశం పార్టీలో ‘నారా’ నందమూరీ వారి కనుసన్నల్లోనే నడవాలన్నది చంద్రబాబు ఆకాంక్ష. ఈక్రమంలో అన్ని పార్టీలు యువతకు పెద్దపీఠ వేస్తుండటంతో తెలుగుదేశం సైతం అదే పద్దతిని కొనసాగిస్తుందని చాటిచెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్టు వినికిడి. అంతేకాకుండా దాదాపు దశాబ్డకాలంగా ప్రతిపక్ష గ్రహణంతో విసిగివేసారిన ‘చంద్రుడు’ ఇక తెరచాటు రాజకీయాలు నెరపాలని నిశ్చయించకున్నట్టు తెలియకనే తెలుస్తోంది. ప్రస్తుతానికి పార్టీలో అన్ని బాధ్యతలు తానే చూసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా అయిన వారికి తన కనుసన్నల్లో నడుచుకునే వారికి కొన్ని విభాగాలు అప్పగిస్తే కొంత విశ్రాంతి దొరుతుందని ఆలోచించినట్టుసైతం అవగతమవుతోంది. ఇదిలాఉండగా మామను నట్టేట ముంచి పదవి దక్కించుకున్న సాంప్రదాయం ఉన్న తెలుగుదేశంలో మరోసారి మామాఅళ్ళుళ్ల రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయన్న పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశంలో చోటుచేసుకోబోతున్న సరికొత్త రాజకీయాల్లో ఈసారి మామను అల్లుడు కట్టడిచేస్తాడా? లేక మామే తన అల్లుడి రాజకీయ ఆటలను కట్టిపాడేస్తాడా? అన్నది వేచిచూద్దామా మరి..?
source: http://www.apherald.com/Politics/ViewArticle/4682/
source: http://www.apherald.com/Politics/ViewArticle/4682/
No comments:
Post a Comment