హైదరాబాద్ : పెంచిన డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీ మూడో గేట్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా అసెంబ్లీని అర్థాంతరంగా వాయిదా వేయడాన్ని ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా తప్పుపట్టారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ధర్నాకు దిగిన ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి పోలీసు స్టేషన్ వరకు తీసుకెళ్లి వదిలేశారు.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=454123&Categoryid=14&subcatid=0
|
No comments:
Post a Comment