తానేం చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మేస్తారన్న భ్రమల్లో ఉండే చంద్రబాబుమరోసారి తన ఆస్తులు అంటూ కాకి లెక్కలు చూపారు. ఆస్తుల అసలు విలువను చెప్పకుండా, అవాస్తవాల చిట్టాను జనం పైకి వదిలారు. చంద్రబాబు నివసిస్తున్న జూబ్లీహిల్స్ కోటే.. బాబు లెక్కల బండారాన్ని బయటపెడుతోంది. దీని విలువ రూ.8.89 కోట్లుగా 2009 ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. ఈ భవనాన్ని తనఖా పెట్టి బ్యాంకు నుంచి రూ.5 కోట్లు రుణం కూడా తీసుకున్నారు. ఇప్పుడు దాని విలువ రూ.23 లక్షలేనని అబద్ధపు లెక్క చెప్పారు. ఇలాంటి కాకి లెక్కల బాగోతాలపై..
1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబు
* అప్పటికి ఆయన కుటుంబానికున్న మొత్తం ఆస్తి మూడెకరాలు
* తండ్రి ఖర్జూరనాయుడిది అరెకరం; తల్లిది రెండున్నర ఎకరాలు
* ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే మంత్రివర్గంలోనూ స్థానం
* 1994లో ముఖ్యమంత్రి పదవి; 1999లో ఆస్తుల వెల్లడి
* అప్పటికే బాబు లెక్కల ప్రకారం 7.7 కోట్లకు చేరిన ఆస్తి
* ఆ తరవాత కూడా వేగంగా పెరుగుతూ వచ్చిన ఆస్తులు
* 2004 నాటికి 20 కోట్లకు; 2009 నాటికి రూ.60 కోట్లకు
* ఇవన్నీ కూడా అఫిడవిట్ల ద్వారా బాబు చెప్పిన లెక్కలే
* వాటిలో ఎన్నడూ ఆస్తుల వాస్తవ విలువ ల్ని వెల్లడించని బాబు
* ప్రకటించిన ఆస్తుల అసలు విలువ చూసినా కొన్ని వేల కోట్లు
* ఇక బినామీలు, బంధువుల పేరిట పెట్టినవి లెక్కేలేదు
* అన్నీ కలిపితే ఎన్ని వేల కోట్లుంటాయో...?
బదులేది బాబూ....?
* అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్‌లో 1,125 గజాల్లో 17 పడగ్గదులతో నిర్మించిన కోట లాంటి భవంతి విలువ రూ.23 లక్షలే ఉంటుందా?
* హైటెక్ సిటీకి సమీపంలో, రియల్ ఎస్టేట్ వెంచర్ల నడుమ మదీనాగూడలో భువనేశ్వరికి ఉన్న ఐదెకరాల విలువ 73 లక్షలే ఉంటుందా? లోకేష్ పేరిట ఉన్న మరో ఐదెకరాలకు అసలు విలువే లేదా?
* హెరిటేజ్ ఫుడ్స్ మార్కెట్ విలువే రూ.320 కోట్లు ఉన్నపుడు దాన్లో మెజారిటీ వాటా బాబు కుటుంబ సభ్యులదైనప్పుడు... దాని విలువ కనీసం రూ.150 కోట్లుండదా?
* 2000వ సంవత్సరంలో అమ్మణ్ణమ్మకు రూ.75 లక్షలెలా వచ్చాయి? ఏ వ్యాపారాలు చేసి సంపాదించారు? ఆమె ఆస్తిని మిగతా పిల్లలందరినీ వదిలేసి లోకేష్‌కే ఎందుకు బహుమతిగా ఇచ్చారు?
* ముంబాయిలో, కర్ణాటకలో రియల్ ఎస్టేటుపై లోకేష్‌కు దృష్టి ఎందుకు పడింది? అక్కడ విలువైన భూములెందుకు కొన్నారు? కొన్నారా... లేక క్విడ్ ప్రోకోలుగా వచ్చినవా?
* అత్యంత విలువైన ఆస్తుల్ని నామమాత్రపు ధరకే కొన్నామని చెబుతూ... ఇప్పటికీ ఆ ధరే పేర్కొంటూ ఆస్తుల విలువను లెక్కిస్తున్న బాబును ఏమనాలి? వాటినే పదేపదే ఎందుకు ప్రకటిస్తున్నారు? తానేం చెప్పినా జనాన్ని నమ్మించడానికి తన మీడియా ఉందనే ధీమానా?
* కోడలికి ఎమ్మార్‌లో విల్లా ఉందని నేరుగా ఎందుకు చెప్పరు? పదేపదే మణికొండ జాగీర్లో ఉందంటూ డొంకతిరుగుడు ప్రకటనలెందుకిస్తారు?
* సుజనా చౌదరి డొల్ల సంస్థల్లో తన భార్యకున్న వాటా గురించి ఎన్నడూ ప్రకటించరెందుకు?
సుజనా సంస్థల్లో వాటాను చెప్పరేం?
పక్కా బినామీ అయిన వై.సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) ఏర్పాటు చేసిన గొట్టాం కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్ గురించి బాబు ఎన్నడూ చెప్పరు. హైటెక్ సిటీ పక్కన హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన అత్యంత విలువైన 3.43 ఎకరాల భూమిని చౌదరికి చెందిన శ్రీచక్ర మర్కండైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు బాబు కేవలం రూ.2.73 కోట్లకు కట్టబెట్టేశారు. ఆ రకంగా హెరిటేజ్ వాటాదార్ల ప్రయోజనాలకు గండికొట్టారు. నిజానికి చౌదరి సంస్థలో అప్పటికే భువనేశ్వరి వాటాదారుగా ఉన్నారు. తరవాత ఇదే భూమి విలువను రూ.85 కోట్లుగా విలువ కట్టి మహారాష్ట్రకు చెందిన సికామ్ సంస్థకు తనఖా పెట్టారు. రూ.45 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే ఈ కంపెనీలో తన భార్యకున్న వాటా గురించి బాబు ఎన్నడూ బయటపెట్టరు.
జూబ్లీహిల్స్ కోట 23 లక్షలా..?
నారా చంద్రబాబు నాయుడికి ఆయన పేరు మీద జూబ్లీహిల్స్‌లో 1,125 గజాల్లో కట్టిన సువిశాలమైన కోట తప్ప వేరే స్థిరాస్తులేవీ లేవు. ఆ కోట విలువ కూడా బాబు చెబుతున్న దాని ప్రకారం కేవలం 23 లక్షలు. గతేడాది మార్చిలో బాబు తన ఆస్తుల్ని ప్రకటించినపుడు కూడా... అంటే ఏడాదిన్నర కిందట కూడా దాని విలువ అంతే!!
చిత్రమేంటంటే 2009 ఎన్నికలప్పుడు తాను దాఖలు చేసిన అఫిడవిట్లోనే బాబు ఈ భవనం విలువను 8.89 కోట్లుగా పేర్కొన్నారు. ఈ భవనాన్ని తనఖా పెట్టి బ్యాంకు నుంచి రూ.5 కోట్లకుపైగా రుణం కూడా తీసుకున్నారు.
కారుచౌక కార్పొరేట్ ఆఫీస్..?
బాబు భార్య భువనేశ్వరి పేరిట పంజగుట్ట సెంటర్లో 650 గజాల్లో నిర్మించిన కార్పొరేట్ ఆఫీస్ ఉంది. దీనికిపుడు బాబు కట్టిన విలువ కేవలం 73 ల క్షలు. కానీ 2009 ఎన్నికలప్పుడు వేసిన అఫిడవిట్లో మాత్రం దీని విలువను 5.69 కోట్లుగా చూపించారు. దీన్ని తనఖా పెట్టి బ్యాంకు నుంచి రూ.5 కోట్లపైగా రుణం కూడా తీసుకున్నారు. అంతేకాదు. ఈ భవనాన్ని తమ జేబు సంస్థ హెరిటేజ్ ఫుడ్స్‌కు లీజుకిచ్చారు. లీజే నెలకు దాదాపు రూ.50 లక్షలు.
గోడౌన్.. మహా డౌన్
భువనేశ్వరి పేరిట తమిళనాడు శ్రీపెరంబదూర్‌లో 2.33 ఎకరాల్లో నిర్మించిన 50 వేల చదరపు అడుగుల గోడ్‌న్‌కు ఇపుడు కట్టిన విలువ 1.86 కోట్లు. 2009 ఎన్నికల అఫిడవిట్లో చెప్పిందైతే 10.49 కోట్లు. దీనిపేర కూడా రూ.6 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్నారు.
హైటెక్ సిటీ పక్కన.. పదెకరాలు
హైటెక్ సిటీ చేరువన మదీనాగూడలో భార్య పేరిట ఐదెకరాలు, కొడుకు లోకేష్ పేరిట ఐదెకరాలు స్థలం ఉండగా... భార్య పేరిట ఉన్న స్థలం విలువను రూ.73.80 లక్షలుగా చూపించారు. లోకేష్ స్థలానికి మాత్రం విలువ కట్టలేదు. ఎందుకంటే అది లోకేష్‌కు నాయనమ్మ నుంచి గిఫ్ట్‌గా వచ్చిందట!! నిజానికి 2009 ఎన్నికల అఫిడవిట్లోనే భార్య పేరిట ఉన్న ఐదెకరాల విలువను రూ.9 కోట్లుగా చూపించారు.
పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలి?
ఇలా తనకు తోచిన విలువలు కడుతూ చంద్రబాబు నాయుడు చెప్పిన విలువల ప్రకారం ఆయన పేరిట, భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్, కోడలు బ్రహ్మణి పేరిట కలిసి ఉన్న మొత్తం ఆస్తుల విలువ 53 కోట్లు. కానీ 2009 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఆస్తుల్ని కలపకుండా... బాబు, భువనేశ్వరి ఆస్తుల విలువే రూ.60 కోట్లు. మరి ఈ లెక్కలనెలా నమ్మాలి? బాబు లెక్కల్ని చూసినవారు రియల్ ఎస్టేట్ విలువలు మరీ దారుణంగా పడిపోయాయనుకోవాలా? అసలు దీనిపక్కన ఎన్ని సున్నాలు పెడితే బాబు ఆస్తుల అసలు విలువ బయటికొస్తుంది? ఇంకెన్ని సున్నాలు పెడితే బినామీల పేరిట ఉన్న ఆస్తులు కూడా బయటపడతాయి? ఒకటా... రెండా? మూడా? బాబూ చెప్పగలరా?
మూడేళ్ల కిందట... అంటే 2009 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర్నుంచి నారా చంద్రబాబు నాయుడు ఎవరూ అడక్కుండానే ఏడాదికోసారి తన ఆస్తుల వివరాల్ని వెల్లడిస్తున్నారు. 2011 సెప్టెంబరు 2న సరిగ్గా వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున తన ఆస్తుల చిట్టా అంటూ కాకిలెక్కల్ని మీడియాకు వెల్లడించిన బాబు... మళ్లీ ఈ నెల 13న అవే లెక్కల్ని ఏకరువు పెట్టారు. బహుశా! ఈ రాష్ట్ర ప్రజలు తానేం చెప్పినా నమ్ముతారన్న అభిప్రాయం తన సియామీ కవల రామోజీరావులానే చంద్రబాబుకూ ఒంటి నిండా ఉన్నట్లుంది. అందుకే... మార్కెట్ విలువలకూ, ఆయన చెప్పే విలువలకూ కనీసం రెండు సున్నాల దూరం ఉంటోంది. గతంలో ఆయనే స్వయంగా ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన లెక్కలకూ ఇప్పటి లెక్కలకూ కనీసం ఒక సున్నా దూరం ఉంటోంది. ఇవన్నీ పక్కనబెట్టినా... ఆస్తుల విలువంటూ బాబు చెప్పిన లెక్కకు, ఆ ఆస్తులపై ఆయన బ్యాంకుల నుంచి ఆయన తీసుకున్న రుణాలకూ భూమికీ ఆకాశానికీ ఉన్నంత తేడా ఉంది. మరి ఇవన్నీ ఎవరిని మోసం చేయటానికి? జనం జ్ఞాపకశక్తిపై, వారి తెలివితేటలపై వీళ్లకి ఎందుకింత చిన్నచూపు? ఇంటిపక్కనే పెట్టుకున్న సి.ఎం.రమేష్ నుంచి ప్రభుత్వాస్తుల్ని పప్పుబెల్లాల్లా పంచితే దోచుకున్న నామా నాగేశ్వరరావు, విదేశీ మనీ లాండరింగ్ సూత్రధారి సుజనా చౌదరి వంటి బినామీల సంగతి తెలియనిదెవరికి? బాలాయపల్లిలోను, ఒరిస్సాలోను వందల ఎకరాల తోటల్ని, సింగపూర్‌లోను, మలేసియాలోను హోటళ్లను, వాణిజ్య ఆస్తుల్ని కూడబెట్టుకున్నారని గతంలోనే తెహల్కా చెప్పలేదా? బినామీలందరినీ చుట్టూ పెట్టుకుని ఓటర్లను తప్ప మిగిలిన వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేయగలుగుతున్న బాబు కథలు తెలియనిదెవరికి?
రెండెకరాల కథ చెప్పరెందుకు?
బాబు ఎప్పుడు ఆస్తులు ప్రకటించినా... తన చరిత్రను 1988 నుంచి ఆరంభిస్తుంటారు. అప్పట్లోనే తమకు 70 ఎకరాల ఆస్తి ఉండేదని, తన తండ్రి మూడెకరాల భూమిని ఊరికి దానంగా కూడా ఇచ్చారని చెబుతుంటారు. కానీ బాబు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయింది 1978లో. మంత్రివర్గంలో స్థానం కూడా అప్పుడే దక్కింది. మరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే నాటికి బాబు ఆస్తులేంటి? ఆయన తల్లిదండ్రులెంత స్థితిమంతులు? ఈ సంగతి బాబు కలలో కూడా చెప్పరు.
వార్షిక ఆదాయం 36,000
బాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే నాటికి ఆయన తండ్రి ఖర్జూరనాయుడికి నారావారి పల్లెలో ఉన్న భూమి కేవలం అరెకరం. తల్లి అమ్మణ్ణమ్మకేమో పసుపు కుంకుమలుగా తెచ్చుకున్న రెండున్నర ఎకరాల భూమి ఉండేది. మొత్తం మూడెకరాలు. 1988లో కర్షక పరిషత్‌కు తన నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కు జవాబుగా బాబు హైకోర్టులో తాను స్వయంగా అఫిడవిట్ దాకలు చేశారు. దాన్లో తన ఆస్తుల్ని వివరిస్తూ... ‘‘నేను సంప్రదాయ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా. మా కుటుంబానికి 77.4 ఎకరాల భూమి ఉంది. 1986 మార్చి నాటికి వ్యవసాయం ద్వారా మా కుటుంబానికి రూ.2.25 లక్షల ఆదాయం వచ్చింది. 1986లో మేం విడిపోయాం. ఆ తరవాత నేను స్వయంగా కూలీల్ని పెట్టి వ్యవసాయం చేశా. ఏడాదికి రూ.36,000 ఆర్జించా’’ అని పేర్కొన్నారు. అలాంటి బాబు...
ఎమ్మెల్యేగా ఎన్నికవటం, మంత్రివర్గంలో స్థానం సంపాదించటం, ఎన్టీ రామారావు కుమార్తెను వివాహమాడటం తప్ప ఇతర వ్యాపారాలేమీ చేయని బాబు... 1992-93 నాటికి రూ.76 లక్షల భారీ పెట్టుబడితో హెరిటేజ్ ఫుడ్స్‌ను ఏర్పాటు చేసే స్థాయికి చేరారు. స్వయంగా వ్యవసాయం చేస్తూ ఏడాదికి రూ.36,000 ఆర్జించిన బాబు... ఆరేళ్లలో 76 లక్షలు ఎలా ఆర్జించారన్నది ఆయన చెబితే తప్ప నిజానికి 1983లో భువనేశ్వరి కార్బయిడ్స్, భువనేశ్వరి కార్బయిడ్స్ అండ్ అల్లాయ్స్ అనే సంస్థల్ని ఏర్పాటు చేసినా... అవి సరిగా నడవక దివాలా తీయటంతో బ్యాంకు రుణాల్నీ ఎగ్గొట్టిన చరిత్ర బాబుది. మరి ఏ లాభాలతో హెరిటేజ్ పెట్టారన్నది ఆయన చెప్పాల్సిన పనిలేదా?
1999 నాటికి 7.79 కోట్లకు చేరి ఆస్తి!
1994లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు... 1999లో నాటి స్పీకరు ఎదుట తన ఆస్తులు ప్రకటించారు. తమ కుటుంబానికి రూ.7.79 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు చెప్పారు. మరి ఇన్ని ఆస్తులెలా కూడబెట్టారు. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా ఏమైనా అన్ని కోట్ల లాభాలొచ్చాయా అంటే... ఆ సంస్థను ఆరంభించిన మొదట్లోనే పబ్లిక్ ఇష్యూకు తెచ్చారు. దానికి అప్పట్లో అంత భారీ డివిడెండ్లు కూడా రాలేదు. మరి ఆరేళ్లు తిరిగేసరికి అన్ని కోట్ల ఆస్తులెలా వచ్చాయి?
2009 నాటికి 60 కోట్లకు...
ఐదేళ్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు సైతం రెట్టింపయ్యే పరిస్థితులు లేకపోయినా బాబు ఆస్తులు మాత్రం 2004 నాటికి రూ.20 కోట్లకు, 2009 నాటికి రూ.60 కోట్లకు చేరాయి. (అప్పుల్ని కలపకుండా). అయితే ఇవన్నీ బాబు అఫిడవిట్లో చెప్పినవి మాత్రమే. తాను కట్టిన లెక్కల ప్రకారం మాత్రమే. అసలు విలువల్ని లెక్కలోకి తీసుకుంటే ఈ ఆస్తుల విలువే కనీసం ఒకటో, రెండో సున్నాలు కలపాల్సి ఉంటుందన్నది తిరుగులేని నిజం. ఇక బాబు బినామీల పేరిట పెట్టిన ఆస్తుల్ని కూడా లెక్కపెడితే ఈ దేశంలోకెల్లా ధనికుడైన రాజకీయవేత్తగా బాబుకు ‘తెహల్కా’ డాట్‌కామ్ ఇచ్చిన టైటిల్ సార్థకమవుతుందన్నది కాదనలేని వాస్తవం.
తల్లి ద్వారా మనీ లాండరింగ్...
చంద్రబాబు కాలేజీ విద్యార్థిగా ఉన్నపుడు ఆయన తల్లి అమ్మణ్ణమ్మకు రెండున్నర ఎకరాల పొలం, రెండు పాడిగేదెలు తప్ప వేరే ఆస్తులేవీ లేవు. వీటిపై వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని చక్కదిద్దేవారు. కానీ 2000వ సంవత్సరంలో ఆమె రూ.75 లక్షలు పెట్టి హైదరాబాద్‌లో విలువైన ఆస్తులు కొన్నారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోని మదీనాగూడలో 5 ఎకరాల భూమిని రూ.40 లక్షలు పెట్టి కొనుగోలు చేయటంతో పాటు, బంజారాహిల్స్‌లో రూ.25 లక్షలు పెట్టి 1,135 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అమ్మణ్ణమ్మకు రూ.75 లక్షలు ఎలా వచ్చాయి? 2000వ సంవత్సరంలో రూ.75 లక్షలంటే ఇప్పుడు ఎన్ని కోట్లకు సమానమవ్వాలి? అంత సొమ్ము ఆమెకు ఎక్కడి నుంచి వచ్చిం ది? అది బాబుది కాదా? పోనీ అమ్మణ్ణమ్మ కష్టపడి అంత సొమ్ము సంపాదించారనే అనుకుందాం...!! ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్న అమ్మణ్ణమ్మ ఈ 75 లక్షల ఆస్తినీ చంద్రబాబు తనయుడైన లోకేష్‌కు మాత్రమే బహుమతిగా ఎందుకు ఇచ్చేసినట్లు? ఇది చాలదా... బాబు తన తల్లిని మనీ లాండరింగ్‌కు ఉపయోగించుకున్నారని చెప్పటానికి? ఇదంతా అక్రమంగా సంపాదించిన సొమ్ము అని రుజువు చేయటానికి?
బినామీ లావాదేవీలకు మచ్చుతునకలివిగో...
బినామీ లావాదేవీల్లో బాబు ఆరితేరిపోయారనటానికి ఒకటిరెండు చిన్న ఉదాహరణలు తెలుసుకుంటే చాలు. మదీనాగూడలో అమ్మణ్ణమ్మ ఐదెకరాల్ని కొన్నది వేరే ఎవరి నుంచో కాదు. బాబు సహచరుడిగా, ఆయన కంపెనీల్లో డెరైక్టర్‌గా, బినామీగా ఇప్పటికీ ఉన్న వడ్లమూడి నాగరాజానాయుడి బంధువుల నుంచి. అంతేకాదు. ఈ ఐదెకరాల్ని ఆనుకుని ఉన్న మరో ఐదెకరాల్ని అదే బంధువుల నుంచి నాగరాజానాయుడి భార సుధా శారద కొనుగోలు చేశారు. తరవాత ఆమె చంద్రబాబునాయుడి భార్య భువనేశ్వరికి విక్రయించేశారు. అంటే... ఈ రూపంలో మొత్తం పదెకరాలు అధికారికంగా నాగరాజా నాయుడి బంధువుల ద్వారా బాబు కుటుంబానికి బదిలీ అయిందన్న మాట. ఇపుడు ఆ పదెకరాల విలువ ఎంత లేదన్నా రూ.250 కోట్ల పైమాటే. ఇంకా చెప్పాల్సిందేంటంటే బాబు పదెకరాలుగా చెబుతూ ఇక్కడ నిర్మించిన కాంపౌండ్‌లో మొత్తం 19 ఎకరాల స్థలం ఉంది. ఇదంతా బాబుదేనని స్థానికుల మాట.
మరో బినామీ లావాదేవీ చూస్తే... అమ్మణ్ణమ్మ రూ.35 లక్షలు పెట్టి బంజారాహిల్స్‌లో కొన్న స్థలాన్ని ఏడాది తిరక్కుండా లోకేష్‌కు బహుమతిగా ఇచ్చేశారు. ఆయనేమో దాన్ని నాగరాజానాయుడి మామ జాస్తి సత్యనారాయణకు విక్రయించారు. ఏడాది గడిచాక... ఆయన దాన్ని తన కుమార్తె సుధా శారదకు బహుమతిగా ఇచ్చేశారు. అంతిమంగా ఈ స్థలాల కథలు రెండూ బాబు, ఆయన బినామీల చుట్టూ తిరిగినవే. కాకుంటే పలు లావాదేవీల ద్వారా నల్లధనాన్ని సాధ్యమైనంతవరకూ తెలుపు చేసుకోలిగారు. చివరకు తమ చేతికే వాటిని రప్పించుకోగలిగారు. ఇదీ... బాబు నీతిచంద్రిక.
లోకేష్‌కు అన్ని ఆస్తులెక్కడివి?
చంద్రబాబు నాయుడి తనయుడు లోకేష్ ఇప్పటిదాకా... ఒక్క హెరిటేజ్ ఫుడ్స్‌లో తప్ప మిగతా ఎక్కడా ఆదాయం తెచ్చిపెట్టిన ఉద్యోగాలేవీ చేయలేదు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్, కార్నెగీ మిలన్ యూనివర్సిటీల్లో చదవటం మినహా అక్కడ చేసిన ఉద్యోగాలేవీ లేవు. అసలు అత్తెరసు మార్కులతో ఇంటర్ పాసైన లోకేష్‌కు అక్కడ సీట్లెలా వచ్చాయన్నది మరో కుంభకోణానికి సంబంధించిన ప్రశ్న. సీట్లకోసం కోట్ల రూపాయల్లో డొనేషన్లు అవసరమయ్యాయని, వాటిని సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు కట్టారని ఇప్పటికీ వినవచ్చే ఆరోపణ. మరి నాయినమ్మ ఇచ్చిన బహుమతుల ద్వారా భారీ ఆస్తుల్ని కూడబెట్టిన లోకేష్... 2006-07 సంవత్సరాల్లో ముంబైలో 8.42 ఎకరాలు, బెంగళూరు సమీపంలో 3.17 ఎకరాలు ఎలా సంపాదించారు? దాదాపు రూ.400 కోట్ల విలువైన ఆస్తుల్ని ఎలా కూడబెట్టగలిగారు?

No comments:
Post a Comment