వైఎస్ విజయమ్మతో బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య భేటీ అయ్యారు. 34% బీసీ రిజర్వేషన్‌ను యథాతథంగా కొనసాగేలా పోరాడాలని వైఎస్ విజయమ్మకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాక రాజ్యాంగ సవరణకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆర్.కృష్ణయ్య తెలిపారు. సెప్టెంబర్ 26న ఇందిరాపార్క్ వద్ద తాము చెపట్టనున్న బీసీ రణభేరికి వైఎస్ విజయమ్మను కృష్ణయ్యా ఆహ్వానించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపి సీఎం కిరణ్ కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లు తగ్గించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారని ఆయన అన్నారు. కృష్ణయ్య విజ్ఞప్తికి వైఎస్ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో బీసీల కోరిక సమంజసమేనని గట్టు రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్ ఏమాత్రం తగ్గినా వైఎస్‌ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదన్నార. బీసీలకు మేలు చేసేందుకు కృష్ణయ్య చేపట్టిన ఆందోళనకు వైఎస్‌ఆర్ సీపీ మద్దతు ఉంటుందని గట్టు రామచంద్రరావు అన్నారు. |
Thursday, 20 September 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment