కేసీఆర్ ఢిల్లీకివెళ్ళి మంతనాలు జరుపుతున్నది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాదని కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి డబ్బు సంచులు గుంజడానికేనని మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినాన్ని కేసీఆర్ నుంచి తెలంగాణ విమోచన దినంగా జరుపుకున్న సందర్భంగా సోమవారం వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో వారు మాట్లాడారు.
కేసీఆర్‌ను రాళ్లతో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ దసరా పండుగ లోపు కేసీఆర్ తెలంగాణ తెస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ విసిరారు.అనంతరం కేసీఆర్ దిష్ఠిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి కేసీఆర్ ఆయన అల్లుడు హరీష్‌రావులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని కొంత మంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

No comments:
Post a Comment