టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రకు సినిమా టచ్ ఇస్తున్నారు. సుద్దాల అశోక్ తేజ ,అనంత శ్రీరామ్ వంటి వారు పాదయాత్ర కోసం ప్రత్యేకంగా రాసిన పాటలను ప్రముఖ గాయకుడు వందేమాతం శ్రీనివాస్ పాడుతున్నారు.ఇది రికార్డింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని ప్రముఖ సినీ నటుడు ఎవిఎస్ చెప్పారు. కాగా తన పాదయాత్రను సఫలం చేయడానికి, ప్రజలను ఆకట్టుకునే తీరు తెన్నులపై సలహాలు తీసుకోవడానికి చంద్రబాబు ప్రముఖ దర్శకులతో సంప్రదింపులు జరిపినట్లు కధనాలు వస్తున్నాయి. ముప్పై ఐదేళ్లుగా రాజకీయాలలో ఉంటూ , ఎనిమిదేళ్ల ఎనిమిది నెలలు ముఖ్యమంత్రిగా, తొమ్మిదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ప్రజలలో కలిసిపోవడానికి సలహాలు ఇవ్వాలని ప్రముఖ దర్శకులు రాజమౌళి, తేజ వంటివారిని అడిగారని ఒక పత్రిక రాసింది. దీనికి ఆ పత్రిక భాష్యం ఎలా చెప్పినా, చంద్రబాబు నాయుడు తన పాదయాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆ నేపధ్యంలో కొన్ని కొత్త మెరుపుల కోసం ఆయన ప్రయత్నించడంలో తప్పు ఉండకపోవచ్చు. అయితే అన్నిటిని మించి ప్రజల భావాలకు అనుగుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, అలాగే చంద్రబాబు ప్రజలకోసమే పాటు పడుతున్నారన్న విశ్వాసం ఈ పాదయాత్ర కలిగించాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20120921_3.php
http://kommineni.info/articles/dailyarticles/content_20120921_3.php
No comments:
Post a Comment