కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన భాగస్వామి సిబిఐ అని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎమ్.వెంకయ్య నాయుడు తీవ్రంగా విమర్శించారు. కొద్దికాలం క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి సిబిఐపై చేసిన వ్యాఖ్యల తరహాలోనే వెంకయ్య నాయుడు కూడా ఈ ఆరోపణలు చేశారు. సిబిఐని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించాలని చూస్తోందని కూడా ఆయన విమర్శించారు. సిబిఐ తీరు తెన్నులపై రాజకీయ పార్టీలు విమర్శించడం సాధారణమే. కాని అదే సిబిఐ కూడా అందుకు అవకాశం ఇచ్చే విదంగా వ్యవహరిస్తోందన్న భావన సర్వత్రా ఉంది. వృత్తి నిపుణత కలిగిన అధికారులు ఉండే సిబిఐ ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి రావడం బాదాకరమే.హైకోర్టు జగన్ కేసులో సిబిఐని ఉక్కిరిబిక్కిరి చేసిందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో వెంకయ్య నాయుడు చేసిన విమర్శలకు ప్రాధాన్యం ఉంది. కాగా మూడో ఫ్రంట్ ఏర్పడడం భ్రమేనని, యుపిఎలో ఉన్నవారే మూడో ఫ్రంట్ అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
source: kommineni
source: kommineni
No comments:
Post a Comment