వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను రాష్ట్రపతి అభ్యర్ధి పీఏ సంగ్మా సోమవారం కలిశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై విజయమ్మకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ను కలవాలని తాను వారం క్రితమే అపాయింట్‌మెంట్ కోరినట్లు సంగ్మా తెలిపారు.
జైలు అధికారులు తన పట్ల వ్యవహారించిన తీరు బాధాకరమన్నారు. అధికారులు తన పట్ల వివక్ష చూపారని వాపోయారు. ఎంపీ అసదుద్దీన్‌కు ఒక న్యాయం..? తనకు ఒక న్యాయమా అని సంగ్మా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈరోజు ఉదయం సంగ్మా చంచలగూడ జైల్లో జగన్ కు కలిసేందుకు వెళ్లారు. అయితే జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవటంతో ఆయన జగన్ ను కలవకుండానే వెనుదిరిగారు.

No comments:
Post a Comment