రాష్ట్రంలో ప్రజలు, రైతులు అనేక సమస్యలతో అల్లాడుతుంటే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ విజయవాడలో వీథి నాటకం ఆడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విమర్శించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే ప్రజాసమస్యలపై పోరాడమని ఆమె సలహా ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షంగా ప్రజలు ఇచ్చిన బాధ్యతని చంద్రబాబు నాయుడు మరచిపోయారన్నారు.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతులు స్వర్ణయుగం చూశారు. ఇప్పుడు వారి కష్టాలు వర్ణణాతీతం అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు అల్లాడుతున్నారు. ఖరీఫ్ ప్రారంభమైనా రుణాలకు సంబంధించిన విధానాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఎరువుల ధరలు పెరిగాయి. విత్తనాల ధరలు పెరిగాయి. ఎరువులు, విత్తనాలు తగినన్ని లభించక రైతులు నానా అవస్తలు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరుణంలో రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక పక్క రైతులు ఇన్ని బాధలు అనుభవిస్తుంటే ప్రతిపక్షంగా టిడిపి ఏమీ మాట్లాడకుండా ఉందని విమర్శించారు. నిజాయితీ ఉంటే రైతు సమస్యలపై పోరాడాలన్నారు.

No comments:
Post a Comment