బుక్కపట్నం (అనంతపురం), న్యూస్‌లైన్ : పుట్టపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో ఆ పార్టీలకు బలమైన గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు సుమారు ఐదు వేల మంది ఆదివారం బుక్కపట్నం మండలం కొత్తకోటలో ఏర్పాటుచేసిన సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సోమశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర పాలక మండలి సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా ఎర్లంపల్లి, కొత్తకోట, మదిరేబైలు, మదిరేబైలుతాండా, అగ్రహారం, పాముదుర్తి తదితర గ్రామాలకు చెందినవారు. ఈ సందర్భంగా కొత్తకోట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చూపినదారిలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
No comments:
Post a Comment