ఎపిపిఎస్ లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.యుపిఎస్ సి తరహాలో పరీక్షా విధానం ప్రవేశపెట్టాలన్న యోచనలో ఉంది. ఏటా ఖాళీలను భర్తీ చేసేవిధంగా కేలండర్ విడుదల చేయాలని ప్రభుత్వం ఏపిపిఎస్ సికి సూచన చేసింది.
సంస్కరణల కమిటీ ఎపిపిఎస్ సి పనితీరుపై నివేదికని ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అందజేసింది. ఈ నివేదికపై విస్తృతంగా చర్చించి, మరింత అధ్యయనం చేయాలని సిఎం నిర్ణయించారు. ఈ నివేదికని పరిశీలించి సిఫారసులు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సిఎం ఆదేశించారు. ఇకపై ప్రతిఏటా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఇకపై మరిన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది. గ్రూప్-2లో ఇక ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండవు. వాటి స్థానంలో గ్రూప్-1బి పోస్టులను ఏర్పాటు చేయాలని సూచన చేసింది. వీటికి ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని కమిటీ సూచన చేసింది.

No comments:
Post a Comment