న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని దోషిగా చిత్రీకరించడానికి సిబిఐ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి ఆరోపించారు. సిబిఐ వ్యవహార శైలిని, రైతు సమస్యలను ప్రధాని, కేంద్ర మంత్రులకు తెలియజెప్పేందుకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నాయకత్వాన ఇక్కడికి వచ్చిన ఏడుగురు సభ్యుల బృందంలో మేకపాటి ఉన్నారు.
సిబిఐ వ్యవహారశైలిపై సుప్రీం కోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రధాన మంత్రిని కోరతామని ఆయన చెప్పారు. సిబిఐ జెడి తన పద్దతిని మార్చుకోవాలని ఆయన కోరారు. జగన్ ని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అయ్యాయన్నారు. జగన్ బయటకు వస్తే తమకు భవిష్యత్ ఉండదని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయన్నారు.
రైతుల సమస్యలు పరిష్కరించాలని, వరికి కనీస మద్దతు ధర 1450 రూపాయలు ప్రకటించాలని ప్రధాన మంత్రిని కోరతామని ఆయన చెప్పారు.

No comments:
Post a Comment