అక్రమ కేసులతో జగన్‌ను వేధిస్తున్న తీరును జాతీయ స్థాయిలో తెలియజెప్పేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం మంగళశారం ఢిల్లీ చేరుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందంలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, సబ్బం హరి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, సుచరిత, ఎంవి మైసూరారెడ్డి ఉన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఈ బృందం కలుసుకోనుంది. అలాగే వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌తో భేటీ కానున్నారు. రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment