YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 3 July 2012

Dangerous Missed Calls (మిస్డ్ కాల్స్ కు తిరిగి కాల్ చేయొద్దు)


తెలీని నెంబర్స్ నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయా? మిస్డ్ కాల్ వచ్చింది కదానని .. ఆ నెంబరుకి మళ్లీ డయల్ చేస్తున్నారా? అయితే నెక్ట్స్‌ టార్గెట్ మీరే కావచ్చు. అవును ఇప్పుడీ మిస్డ్ కాల్సే యావత్ దేశాన్ని వైబ్రేట్ చేస్తున్నాయి. 

మీ దగ్గర సెల్‌ఫోన్ ఉందా ... అయినా ఈ మధ్య కాలంలో మినిమమ్ రెండు మొబైల్స్ లేని వారుంటున్నారా? అయితే ఇకపై సెల్‌ఫోన్స్‌పై ఓ కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా ... మీ సెల్‌ క్లోన్ అయిపోవచ్చు. అవును దేశంలోకి కాల్ టెర్రరిస్టులు చొరబడ్డారు. మనకు తెలీకుండా మన ప్రమేయం లేకుండానే మనం మిస్డ్ కాల్ బాధితుల జాబితాలోకి చేరిపోవచ్చు. మన దేశం నుంచి సమాచార దోపిడికి  శత్రుదేశాలు  కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. దీనికి సంబంధించి టెలికామ్‌ టెర్రర్‌పై ఇంటిలిజెన్స్‌ ఓ నివేదికను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగులోకి  వచ్చిన ఈ మిస్డ్ కాల్ టెర్రరిజం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం  సృష్టిస్తోంది.ఇప్పటికే అక్కడ  +92,#90,#09 సిరీస్ తో   ప్రారంభంఅయ్యే మిస్డ్ కాల్స్ కు , డయల్ చేసి సిమ్ కార్డ్ క్లోనింగ్ బారిన పడిన వారి సంఖ్య లక్షకు చేరుకుంది. టెర్రర్ క్లోనింగ్ ద్వారా బాధితులు   తమ ఫోన్స్ లో  సేవ్ చేసుకున్న విలువైన డేటా లో పాటు తమ వ్యక్తి గత  సమాచారమైన ఏటిఎమ్,క్రెడిట్ కార్డ్,డెబిట్ కార్డ్,ల పాస్ వర్డ్ లతో సహా విలువైన ఇతర పాస్ వర్డ్ లు కూడా ఈ టెర్రర్ కాల్స్  వల్ల పోగట్టుకున్నట్టు ఉత్తర్ ప్రదేశ్ లోని వెస్ట్రన్ టెలికం డివిజన్ బయట పెట్టింది. 


కొన్ని సందర్భాల్లో కాల్ సెంటర్స్ ఎగ్జిక్యూటివ్ప్ గా పరిచయం చేసుకుని  మీ సర్వీస్ ప్రొవైడర్ సమాచారాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత మీ నెంబరు నుంచి స్లాష్ 09, లేదా స్లాష్ 90 ను ప్రెస్ చేయమని కోరుతారు. అలా చేశారో నిలువు దోపిడీనే అంటున్నారు IT నిపుణులు. కాబట్టి +92,#90,#09 నెంబర్ల నుంచి మిస్డ్ కాల్స్ వస్తే ఎత్తకపోవడమే బెటర్. ఇప్పటికే ఈ విషయమై వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలంటూ పలు బ్రాడ్ బాండ్  మొబైల్ ఆపరేటర్లు SMS లద్వారా అలర్ట్ చేస్తున్నాయి.సో బీ కేర్‌ఫుల్‌. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!