విశాఖపట్నం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల ఆదివారం మధ్యాహ్నాం హైదరాబాద్‌కు బయలుదేరారు. తిక్కవాని పాలెంలో ఎన్‌టీపీసీ వల్ల బాధితులుగా మారిన మత్స్యకారులను వైఎస్ విజయమ్మ, షర్మిలాలు ఆదివారం ఉదయం పరామర్శించారు. కష్టాలు తీరే వరకు మత్స్యకారుల వెన్నెంటే ఉంటామని వైఎస్ విజయమ్మ భరోసా ఇచ్చారు. అనంతరం ఎన్‌టీపీసీ జనరల్ మేనేజర్‌తో వీరిరువురు భేటీ అయ్యారు. మత్య్సకారుల ఉపాధి కల్పించేలా సత్వర చర్యలు చేపట్టాలని వైఎస్ విజయమ్మ ఎన్‌టీపీసీ జీఏంను కోరారు. అనంతరం విశాఖపట్నం చేరుకుని హైదరాబాద్‌కు పయనమయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment