- పరిశ్రమలకు రూ.వందల కోట్ల రాయితీ నిధులు విడుదల చేయని సర్కారు
- పెరుగుతున్న విద్యుత్ సబ్సిడీ, పావలావడ్డీ బకాయిల కుప్ప
- రాయితీలు ఇవ్వకపోతే మనుగడ కష్టమంటున్న ఫ్యాప్సియా
హైదరాబాద్, న్యూస్‌లైన్: పరిశ్రమలకు సర్కారు చెల్లించాల్సిన రాయితీల బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటికే విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలను ఇది మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే విద్యుత్ సబ్సిడీలు, పావలావడ్డీకే రుణాలంటూ భారీగా ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. వాటి నిధుల విడుదలలో మాత్రం తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో బకాయిల కుప్ప రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీల కోసం పరిశ్రమలశాఖ అధికారుల చుట్టూ పారిశ్రామికవేత్తలు కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోంది. భారీ పరిశ్రమలకు వెంటనే రాయితీ నిధులు విడుదల చేసే ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలపై మాత్రం చిన్నచూపు చూస్తోంది.
రాయితీలను సకాలంలో విడుదల చేయకపోతే పరిశ్రమల మనుగడ కష్టంగా మారనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల సంఘాల సమాఖ్య (ఫ్యాప్సియా) అధ్యక్షుడు ఏపీకె రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ఇది మరింత శరాఘాతంగా మారనుందన్నారు. ఈ రాయితీలు వస్తాయని ఆశించి.. ఆర్థిక ప్రణాళికలు రచించుకున్న పరిశ్రమల పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం ఉంది. కేవలం విద్యుత్ సబ్సిడీ మొత్తం ఏకంగా రూ.244 కోట్లకుపైగా బకాయి పడి ఉండగా, పావలావడ్డీ బకాయిలు రూ.25 కోట్లకు పైగా ఉందన్నారు.
ఆమోదం ఉన్నా..: రాష్ట్రస్థాయిలో పరిశ్రమలశాఖ కమిషనర్ నేతృత్వంలోని రాష్ట్రస్థాయి కమిటీ(ఎస్‌ఎల్‌సీ), కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ (డీఎల్‌సి) రాయితీల విడుదలకు ఆమోద ముద్ర వేసినప్పటికీ ఇంకా నిధులు మాత్రం విడుదల కాలేదు. ఎస్‌ఎల్‌సీ ఆమోదించినప్పటికీ 1130 యూనిట్లకు వివిధ రాయితీల కింద ఇప్పటివరకు 262.66 కోట్ల మొత్తం విడుదల కాలేదు. అదేవిధంగా డీఎల్‌సీ ఆమోదించినప్పటికీ 44 యూనిట్లకు ఇంకా 17.22 కోట్ల రాయితీ విడుదల కావాల్సి ఉంది. వీటితో పాటు ఇంకా దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన పలు కంపెనీలకు విద్యుత్, పావలా వడ్డీ సబ్సిడీ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది.

No comments:
Post a Comment