ప్రకాశం జిల్లాలోని కంభం చెరువుకన్నా తక్కువ నీటి నిల్వ సామర్థ్యం గల కర్ణాటకలోని పరగోడు ప్రాజెక్టు, కనీసం ఒక పెద్ద చెరువు స్థాయి కూడా లేని నాగలమడక రిజర్వాయర్, కనీసం 3 టీఎంసీల స్థాయికూడా లేని మహారాష్ట్ర బాబ్లీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల మీద దాదాపు దండయాత్ర లాగా తన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ అనుచరుల సహకారంతో యుద్ధానికి బయల్దేరి పోరాటం లాంటిది జరిపిన చంద్రబాబు... జలయజ్ఞం పథకాల సత్వర నిర్మాణానికి జరిపిన ఆందోళనలు ఏమీ లేకపోవడం గమనార్హం. రోశయ్య, కిరణ్ సర్కార్లపైన, కేంద్ర ప్రభుత్వంపైన, ఒత్తిడి తెచ్చి రైతాంగ ప్రయోజనాల కోసం సాగు నీటిని వినియోగించుకోవడానికి జరిపిన రాజకీయ పోరాటాలు అంతకంటే లేవు.నేడు రాష్ట్రంలో ప్రత్యేకించి కృష్ణా, గోదావరి డెల్టా ప్రాం తాల్లో రైతులు తీవ్రమైన ఇబ్బం దులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా దిగువన వరినాట్లు వేసుకోవడానికి మునుపెన్నడూ లేనన్ని కష్టాలను ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటోంది. నాట్లు వేసుకోవడానికి నాగార్జునసాగర్ నుంచి కృష్ణాడెల్టాకు నీటి విడుదలను తెలంగాణ నాయకులు... ఏ పార్టీకి చెందిన నాయకులైనా కావచ్చు, వారి ప్రయోజనాలను తుంగలో తొక్కి కృష్ణా డెల్టాకు సాగర్ నుంచి నీటి విడుదలను వ్యతిరేకిస్తున్నారు.
అలాగే తమకు కృష్ణాపరీవాహక ప్రాంతంలో హక్కుగా విడుదల చేయాల్సిన నీటి విడుదలను వ్యతిరేకించడం దారుణమంటున్నారు కృష్ణా, గుంటూరు జిల్లాల రైతాంగం. నాగార్జునసాగర్ ప్రయోజనాలకు శ్రీశైలంలో ఉన్న నీటిని విడుదల చేయరాదని, ఆ నిల్వ నీటిని సీమ ప్రయోజనాలకే ఉపయోగించాలని రాయలసీమ నాయకులు డిమాండు చేస్తున్నారు. కృష్ణా జలాల పంపిణీపై దీంతో మూడు ప్రాంతాలలో విద్వేషాలు పెరిగే అవకాశముంది. మరోవైపు గోదావరి డెల్టాలో రైతాంగం పంట గిట్టుబాటు కావడం లేదని, దిగుబడి తగ్గడం వల్ల తాము నష్టపోతున్నామని, ఎరువుల ధరలు, ఇతర ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో తాము వ్యవసాయం చేయలేమని అంటూ లక్షల ఎకరాల్లో రైతాంగం ఖరీఫ్‌కు దూరంగా ఉండటం మరో దారుణం.
కృష్ణా పరీవాహక ప్రాంతంలో నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద 10 లక్షల 40 వేల ఎకరాలు, కుడి కాలువ కింద 11 లక్షల 70 వేల ఎకరాలు, కృష్ణా డెల్టాకు దిగువన 12 లక్షల 26 వేల ఎకరాలు, గోదావరీ డెల్టాలో 12 లక్షల 40 వేల ఎకరాల ఆయకట్టు సకాలంలో వర్షాలు కురవక తీవ్ర సంక్షోభానికి గురవుతోంది. గత 120 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని విధంగా కృష్ణా డెల్టాలో 2001-03లో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడటం వల్ల డెల్టా రైతాంగం కష్టనష్టాలకు గురైంది. అప్పుడు అల్‌మట్టి డ్యామ్ నుంచి నీటి విడుదల కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక విజ్ఞప్తులు చేసినా ఫలితం దక్కలేదు. అల్‌మట్టి డ్యామ్, మహారాష్ట్రలోని మిగతా డ్యామ్‌లు నిండి నీరు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా బ్యారేజ్‌కు చేరడానికి నిస్సందేహంగా ఓ నెల రోజులు పట్టవచ్చు. ఇటువంటి దుర్భర పరిస్థితి రాష్ట్రం ఎదుర్కోవడానికి కారణం కేవలం ప్రకృతి దయాదాక్షిణ్యాల మీద రైతాంగం ఆధారపడటమేనా? లేదా పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎదురవుతోందా? ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడుగా రైతాంగ సమస్యలను లోతుగా అధ్యయనం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ రోజుల్లో ఆందోళన చేపట్టారు. పోరాటాలకు నాయకత్వం వహించారు. పాదయాత్రలు చేశారు. విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించిన ఫలితంగా జలయజ్ఞం వంటి ప్రతిష్టాత్మక పథకం అమలుకు నాందీ ప్రస్తావన జరిగింది. గోదావరీ, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో, నాగార్జునసాగర్ ఆయకట్టుదారుల సమస్యల పరిష్కారానికి, ఎగువన శ్రీశైలం ద్వారా లబ్ధి పొందాల్సిన మహబూబ్‌నగర్, నల్లగొండ, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అవసరాలు తీర్చడానికి జలయజ్ఞంలో ఆయన ఎన్నో పథకాలు రూపొందించారు. జలయజ్ఞంలో ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి.
అవి ఇందిరాసాగర్ (పోలవరం) ప్రాజెక్టు, మహాత్మాజ్యోతిరావు ఫూలే (దుమ్ముగూడెం) ప్రాజెక్టు, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (ప్రాణహిత-చేవెళ్ల) సుజల స్రవంతి, బాబూ జగ్జీవన్‌రామ్ (ఉత్తరాంధ్ర) సుజల స్రవంతి, జె. చొక్కారావు (దేవాదుల) ఎత్తిపోతల పథకం, పీవీ నరసింహారావు (కంతాలపల్లి) సుజల స్రవంతి, శ్రీపాదసాగర్ (ఎల్లంపల్లి) ఎత్తిపోతల పథకాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించి కేంద్రం నిధులు సమకూర్చాలని, తద్వారా రాష్ట్రంలో అభివృద్ధికి పునాదులు వేయాలని వైఎస్ కేంద్రాన్ని కోరారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలు ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల దిగువన ఆంధ్రప్రదేశ్ ఉండటం వల్ల నీటి లభ్యతకు ఒనగూడిన అవకాశాల వినియోగానికి జలయజ్ఞంలో వైఎస్ ఆస్కారం కల్పించారు. ప్రాజెక్టులకు పునాదులు వేశారు. పోలవరం, పులిచింతల, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ పథకాలు పూర్తయితే నాగార్జునసాగర్, కృష్ణా బ్యారేజ్ దిగువన ఆయకట్టు స్థిరీకరణ జరిగి పులిచింతల ద్వారా 13 లక్షల 8 వేల ఎకరాల ఆయకట్టు, 120 మెగావాట్ల విద్యుత్ లభ్యత సమకూరుతుంది. అలాగే పోలవరం ద్వారా నికరంగా 7 లక్షల 20 వేల ఆయకట్టు ఏర్పడుతుంది.
అంతేకాదు, ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో గోదావరిలో లభించే వరదనీటిని, పోలవరంలో నిల్వ చేయడం ద్వారా గోదావరి దిగువనున్న 10 లక్షల ఎకరాల ఆయకట్టులో రబీసాగు స్థిరీకరణ, లక్షా 2 వేల ఎకరాలలో ఖరీఫ్ స్థిరీకరణ సాధ్యపడుతుంది. మరోవైపు వరదనీరు పెరిగినప్పుడు పోలవరం, దుమ్ముగూడెం, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌లో చేరిన నీటిని కృష్ణా డెల్టాలోకి మళ్లించుకొని పులిచింతల, కృష్ణా బ్యారేజ్‌లలో నిల్వ చేసుకొనే అపూర్వమైన అవకాశం మనకు ఉంది. దీని ఫలితంగా 360 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం ద్వారా ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. 220 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. కంతాలపల్లి, దేవాదుల ప్రాజెక్టుల దిగువన ఆయకట్టు స్థిరీకరణ, వరంగల్, కరీంనగర్ జిల్లాల సేద్యపునీటి ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడుతుంది.
ఈ ప్రాజెక్టులు డాక్టర్ వైఎస్ మరణానంతరం తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. ధాన్యాగారాలైన జిల్లాలను, కరువుపీడిత ప్రాంతాలైన జిల్లాలను ఆదుకొనే ఈ పథకాలను మూడేళ్ల కాలంలో నిర్లక్ష్యం చేయడం దేశద్రోహం కన్నా ఘోరం. కూకతిపాళెం, ముసురుమిళ్ల, గురు రాఘవేంద్ర లిఫ్ట్, గుండ్లకమ్మ, మత్తడి వాగు, చౌటుపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్... ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామని ఏడాది నాడు ప్రకటించారు. వీటిని పూర్తి చేయడానికి రూ.300 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. మరో 17 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి వాటి ద్వారా కూడా నీరందిస్తామని చెప్పారు. అందుకు రూ.4,000 కోట్లు అవసరమవుతుంది. కానీ ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడం మాని అటకెక్కించారు.
ప్రకాశం జిల్లాలోని కంభం చెరువుకన్నా తక్కువ నీటి నిల్వ సామర్థ్యం గల కర్ణాటకలోని పరగోడు ప్రాజెక్టు, కనీసం ఒక పెద్ద చెరువు స్థాయి కూడా లేని నాగలమడక రిజర్వాయర్, కనీసం 3 టీఎంసీల స్థాయికూడా లేని మహారాష్ట్ర బాబ్లీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల మీద దాదాపు దండయాత్ర లాగా తన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ అనుచరుల సహకారంతో యుద్ధానికి బయల్దేరి పోరాటం లాంటిది జరిపిన చంద్రబాబునాయుడు... జలయజ్ఞం పథకాల సత్వర నిర్మాణానికి జరిపిన ఆందోళనలు ఏమీ లేకపోవడం గమనార్హం. రోశయ్య, కిరణ్ సర్కార్లపైన, కేంద్ర ప్రభుత్వంపైన, ఒత్తిడి తెచ్చి రైతాంగ ప్రయోజనాల కోసం సాగు నీటిని వినియోగించుకోవడానికి జరిపిన రాజకీయ పోరాటాలు అంతకంటే లేవు.
బాబుకు తోడుగా ఎల్లో మీడియా యజమానులు, జలయజ్ఞం పథకంపై తీవ్రమైన అవినీతి అరోపణలు సంధించడం తెలిసిందే. మరోవైపు వామపక్ష పార్టీల నాయకులు జలయజ్ఞం పథకాల సత్వర అమలుకు పోరాట మార్గం పట్టకపోవడం చూస్తున్నదే. కేవలం నామమాత్రపు తీర్మానాలు చేయడం, ప్రకటనలు గుప్పించడం తప్ప... జరిపిన సమరశీల పోరాటాలు లేవు. విచిత్రమేమిటంటే ఈ పార్టీల రైతు సంఘాలు జలయజ్ఞంలోని పథకాల గురించి నిరంతరం ఆందోళనలు జరిపారు, పోరాటాలు చేశారు. పైగా అవి అమలు పరచాల్సిన సమయం వచ్చేటప్పటికి అవినీతి, అక్రమాల పేరుతో వైఎస్‌పై రాజకీయ దాడిని తీవ్రం చేశారు. మరో వామపక్ష పార్టీ... పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడానికి వీలుగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించింది.
జలయజ్ఞానికి నిధులు రాష్ట్రమే స్వతంత్రంగా సమకూర్చుకోవాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అహ్లూ వాలియా ఓ సందర్భంలో సూచించారు. వైఎస్ ఉంటే ఆయనకు అంత ధైర్యం ఉండేదా అన్నది ప్రశ్న. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో ప్రస్తుత ప్రణాళికా సంఘం కార్యాలయంలో కార్పొరేట్ దిగ్గజాలు మోహరించడం... అందులో రిలయన్స్ కంపెనీ అధిపతి అంబానీ చేరడం వెనక మతలబు ఏమిటి? ఉచిత విద్యుత్తు, రూ.2 కిలో బియ్యం, ఫీజు రీయింబర్స్‌మెంటు లాంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మోకాలడ్డటంలో శ్రద్ధచూపిన అహ్లూవాలియా పేదరికానికి ఇచ్చిన సరికొత్త నిర్వచనం ఏమిటో అందరికీ తెలిసిందే. పట్టణాల్లో రోజుకు రూ.36, గ్రామాల్లో రూ.28 గా ఆదాయం ఉంటే వారు పేదలు కాదని సెలవిచ్చి నవ్వులపాలైన ఘనత ఆయనకే దక్కుతుంది. ఈ మహానుభావుడే విదేశాల్లో పర్యటన జరిపినప్పుడు రోజుకు రూ.2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జాతిని నివ్వెరపరచింది.
రాష్ట్రంలో ఇంతటి బలహీనమైన నాయకత్వం మున్నె న్నడూ లేదు. ప్రజాసమస్యలను, పాలనను గాలికొదిలేశారు. ప్రకృతి దయాదాక్షిణ్యాలకు ప్రజలను వదిలేశారు. రూ. లక్షా 40 వేల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం జలయజ్ఞానికి జరిపిన కేటాయింపులు ఎంత? జలయజ్ఞం పథకాల ఒరవడిలోనే రాయలసీమలోని నాలుగు జిల్లాలకు ఉపయోగపడే హంద్రీ-నీవా పథకం నిధుల కేటాయింపులు లేకుండా నత్తనడకన నడవడం సీమకు ప్రాతినిధ్యం వహించే ముఖ్యమంత్రి, రెవెన్యూమంత్రి నిజాయితీకి అద్దం పడుతోంది.
వైఎస్ పథకాలు నిర్లక్ష్యానికి గురికాక తప్పదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నేతలకు, ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబుకు జలయజ్ఞంపై కానీ, రాష్ట్రాభివృద్ధిపై కానీ శ్రద్ధలేదని, అవినీతి ఆరోపణలతో వైఎస్ ప్రతిష్టను దిగజార్చడం, ఆయన పథకాల అమలుకు పోరాడుతున్న వైఎస్సార్ పార్టీ, సాక్షి పత్రిక, సాక్షి టీవీ చానెల్‌పై దాడులు చేయడం మాత్రమే వారి పని అని, సీబీఐని రెచ్చగొట్టి తమ కుటుంబంపై వారు దాడులు జరిపిస్తారని ముందే పసిగట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లారు.
వైఎస్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల అవలంబిస్తున్న అలక్ష్యాన్ని ఎండగడుతూ ఆ కార్యక్రమాలను కొనసాగించే స్థాయి తనకున్నదని, తనలో ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని నిరూపించుకున్నారు. ప్రజల ఓటు శక్తితో తమ పార్టీకి తగినంత ఆధిక్యత లభిస్తే పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల తదితర ప్రాజెక్టులను, జలయజ్ఞంలోని ఇతర పథకాలను పూర్తి చేయడానికి తమ పార్టీ కంకణం కట్టుకుందని ప్రకటించారు. ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించిన తరువాతే పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉంటుందని ఆయన భరోసా ఇవ్వడం వల్లే ముంపునకు గురయ్యే పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున మొన్నటి ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ, షర్మిల ఎన్నో కష్టనష్టాలకోర్చి, అవమానాలు, అపనిందలను భరిస్తూ ప్రజాసేవ చేస్తున్న తీరును వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆదర్శంగా తీసుకోవాలి. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు వమ్ము కాకుండా ఓవైపు పోరాటం చేస్తూ మరోవైపు ఇడుపులపా య ప్లీనరీలో ప్రకటించిన పథకాలను ప్రజల్లోకి జగన్ తీసుకెళ్లారు. దీర్ఘదృష్టితో వైఎస్ చేపట్టిన పథకాలు అమ లయ్యే మంచిరోజు రావడానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించడమే ప్రజలముందున్న తక్షణ కర్తవ్యం.
బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడుగా రైతాంగ సమస్యలను లోతుగా అధ్యయనం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ రోజుల్లో ఆందోళన చేపట్టారు. పోరాటాలకు నాయకత్వం వహించారు. పాదయాత్రలు చేశారు. విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించిన ఫలితంగా జలయజ్ఞం వంటి ప్రతిష్టాత్మక పథకం అమలుకు నాందీ ప్రస్తావన జరిగింది. దానిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రం నిధులు సమకూర్చాలని, తద్వారా రాష్ట్రంలో అభివృద్ధికి పునాదులు వేయాలని వైఎస్ కేంద్రాన్ని కోరారు.
రాష్ట్రంలో ఇంతటి బలహీనమైన నాయకత్వం మున్నెన్నడూ లేదు. ప్రజాసమస్యలను, పాలనను గాలికొదిలేశారు. ప్రకృతి దయాదాక్షిణ్యాలకు ప్రజలను వదిలేశారు. రూ. లక్షా 40 వేల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం జలయజ్ఞానికి జరిపిన కేటాయింపులు ఎంత? జలయజ్ఞం పథకాల ఒరవడిలోనే హంద్రీ-నీవా పథకం నిధుల కేటాయింపులు లేకుండా నత్తనడకన నడవడం సీమకు ప్రాతినిధ్యం వహించే ముఖ్యమంత్రి,రెవెన్యూమంత్రి నిజాయితీకి అద్దం పడుతోంది.
No comments:
Post a Comment