YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 3 July 2012

సిఎంను కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు

రైతు సమస్యలపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. రైతు సమస్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని వారు సిఎంను కోరారు. రైతులకు 9 గంటలపాటు ఉచిత విద్యుత్ అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ కోసం ప్రభుత్వం ఆలోచిస్తోందన్న భరోసా రైతులకు ఇవ్వలేకపోతున్నారన్నారు. రైతు పక్షపాతి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అశయాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్ ని ప్రభుత్వం అరికట్టలేకపోతోందన్నారు. రైతులకు తక్షణం ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!