వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం పోలీస్ కమిషనర్ ని కలిసి సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణపై ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చేవిధంగా జెడి వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు. తప్పుడు కేసుల్లో జగన్ ని ఇరికించారన్నారు. లక్ష్మీనారాయణ సిబిఐ మ్యాన్యువల్ కు వ్యతిరేకంగా వ్వవహరిస్తున్నారని సిపి తెలిపారు. సిబిఐ సమాచారాన్ని లీక్ చేశారని ఆరోపించారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని వారు కోరారు. పనిగట్టుకొని జగన్ పై కక్ష సాధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాసిన లేఖని కూడా వారు సిపికి అందజేశారు.
దీనిపై న్యాయవాదుల అభిప్రాయాన్ని తీసుకుంటామని సిపి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. సిపిని కలిసినవారిలో ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్ కూడా ఉన్నారు.
దీనిపై న్యాయవాదుల అభిప్రాయాన్ని తీసుకుంటామని సిపి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. సిపిని కలిసినవారిలో ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్ కూడా ఉన్నారు.
No comments:
Post a Comment