మూడో స్థానంలో కాంగ్రెస్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావు తన సమీప టీడీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై 14,362 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి గంటెల సుమన మూడో స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు జరిగిన మొత్తం 17 రౌండ్లలో 13 రౌండ్లు వైఎస్సార్ కాంగ్రె స్ ఆధిక్యత కొనసాగింది. 1983 నుంచి వరుసగా ఆరు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఇక్కడ నుంచి విజయం సాధిస్తూ వచ్చారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బాబూరావు గెలిచారు. నాడు కూడా తెలుగుదేశం అభ్యర్థి చెంగల వెంకట్రావుపైనే గెలుపొందడం మరో విశేషం. అయితే నాటి మెజారిటీ కంటే నేటి మెజారిటీ భారీ స్థాయిలో ఉండడంతో.. టీడీపీ కంచుకోట పూర్తిగా బద్దలైనట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఈ ఎన్నికకు ప్రభుత్వోద్యోగుల నుంచి ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా రాకపోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.
లెక్కల్లోకి ఎక్కని ఓట్లు
శుక్రవారం లెక్కింపు సందర్భంగా ఒక ఈవీఎం సీల్ లేకుండా ఖాళీగా దర్శనమిచ్చింది. ఆరా తీయగా పోలింగ్ రోజున ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెంలో 190వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఒక ఈవీఎం మరమ్మతులకు గురవడంతో కొత్త ఈవీఎంను పెట్టారు. కానీ పోలింగ్ పూర్తయ్యాక స్ట్రాంగ్‌రూమ్‌కు పొరపాటున పనిచేయని ఈవీఎంను అప్పగించారు. దీంతో సీల్ ఉన్న ఈవీఎంను పక్కనబెట్టి సీల్‌లేని ఖాళీ ఈవీఎంను కౌంటింగ్‌లో వుంచడం వల్ల ఇదంతా జరిగిందన్న నిర్ధారణకు వచ్చారు. బరిలో ఉన్న అభ్యర్థుల నుంచి అభ్యంతరం లేకపోతే ఈ ఓట్లను పరిగణనలోకి తీసుకోనవసరం లేదని ఈసీ నుంచి సమాచారం అందడంతో ఆ మేరకు అధికారులు దాన్ని అలాగే ఉంచేశారు. దీంతో 597 ఓట్లు ఎవరి ఖాతాలో చేరకుండా పోయాయి. కాగా సంబంధిత ప్రిసైడింగ్ అధికారిపై ఈసీ చర్యకు ఆదేశించింది.
ప్రజలకు అంకితం: బాబూరావు
తన గెలుపు దివంగత వైఎస్సార్‌కు, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులకు అంకితమని గొల్ల బాబూరావు అన్నారు. పేట ప్రజలు చూపిన అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ధర్మానికి అధర్మానికి, విశ్వాసానికి వంచనకు మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు విశ్వాసానికి, ధర్మానికి మద్దతు ప్రకటించారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడిన పాలక ప్రతిపక్షాలకు కనువిప్పు కావాలన్నారు. ప్రజలు తమ తీర్పు ద్వారా జగన్ నిర్దోషి అని చాటి చెప్పారన్నారు. ఈ ఫలితాలు ద్వారా ప్రజలు రాజన్న రాజ్యాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. విజయమ్మ, షర్మిల ప్రచారం తన

No comments:
Post a Comment