గన్నవరం (కృష్ణా): ఉపఎన్నికల్లో అన్ని స్థానాల్లోను తమ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు చెప్పారు. ఆయన గురువారం ఒంగోలు వెళ్లేందుకు విమానంలో గన్నవరం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు వైఎస్సార్ సీపీ పక్షాన నిలిచారని చెప్పారు. నెల్లూరు లోక్‌సభ స్థానంతోపాటు 18 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. ఉపఎన్నికల ఫలితాలు అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment