టీడీపీ డిపాజిట్ గల్లంతు
ఆళ్లగడ్డలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ ఫ్యాన్ హవా కొనసాగింది. ఆళ్లగడ్డలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి శోభా నాగిరెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాప్‌రెడ్డిపై 36,795 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ పార్టీ తరపున పోటీ చేసిన ఇరిగెల రాంపుల్లారెడ్డికి 20,374 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2,009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన శోభా నాగిరెడ్డికి 61,555 ఓట్లు రాగా.. ఈ ఉప ఎన్నికల్లో 88,697 ఓట్లు సాధించడం విశేషం. ఈ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీ అభ్యర్థులతో పాటు మరో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు రంగంలోకి దిగారు.
ఇది ప్రజా విజయం..: శోభా నాగిరెడ్డి
ఈ గెలుపు ప్రజా విజయం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అన్ని వర్గాలు తమ సొంత పార్టీలా భావించాయి. అందుకే అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగలేదు. కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయలు పంచినా ప్రజాబలం ముందు అవేమీ పనిచేయవని రుజువైంది. పాలక, ప్రతిపక్షాలు ఏకమై జగన్‌పై చేసిన అసత్య ఆరోపణలను ప్రజలు ఓటుతో తిప్పికొట్టారు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం నైతిక భాధ్యత వహించి ఎన్నికలకు రావాలి.

No comments:
Post a Comment