తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌పై 11919 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయిన ట్టుగా కనబడుతోంది. త్రిమూర్తులు 77292ఓట్లు సాధించగా, టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు కేవలం 6256 ఓట్లు దక్కించుకుని డిపాజిట్ కోల్పోయారు. బోస్‌కు 65373 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నర్సాపురంలోనూ టీడీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోవడం ఇక్కడ ప్రస్తావనర్హం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment