వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శనివారం శ్రీకాకుళం జిల్లా చేరుకున్నారు. రణస్థలం వద్ద ఆమెకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఉపఎన్నికల విజయోత్సవంలో ఉన్న కార్యకర్తలు పెద్దఎత్తున అన్ని గ్రామాల్లోనూ రోడ్లపైకి వచ్చి విజయమ్మను ఆహ్వానించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ అభిమానులు జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రణస్థలం నుంచి ఆమె చిలకపాలెం మీదుగా రాజాం వెళ్లి లక్ష్మీపేట చేరుకోనున్నారు. లక్ష్మీపేట ఘటనలో మృతిచెందిన నలుగురు కుటుంబాలను విజయమ్మ పరామర్శిస్తారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.

No comments:
Post a Comment