తమ గెలుపును జగన్‌కు అంకితం చేస్తున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు విజేతలు హైదరాబాద్ వచ్చారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కలిసి అభినందనలు తెలిపారు. పార్టీ కార్యాలయ ఆవరణలోని దివంగత మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజలంతా రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని ఎమ్మెల్యేలు తెలిపారు. ఆ కల సాకారం చేయడమే తమ లక్ష్యమన్నారు. |
తిరుపతి : ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శనివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్ చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపించాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలించే అర్హత కోల్పోయిందని, సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్లే ప్రజలు కసితీరా కాంగ్రెస్ ను ఓడించారన్నారు. బాబు మోసపూరిత మాటలను ప్రజలు నమ్మలేదని అందుకే టిడిపి అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించారని భూమన విమర్శించారు.
No comments:
Post a Comment