హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో విజయం సాధించిన 15 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ నెల 21న పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. అంతకు ముందు రోజు 20వ తేదీన వీరంతా వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఫలితాలు వెలువడిన తరువాత శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పదవీ స్వీకారం చేసిన తరువాత అదే రోజు ఎమ్మెల్యేలంతా మళ్లీ సమావేశమై ప్రజా సమస్యలపై చర్చిస్తారు. ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, కె.గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి పార్టీ కార్యాలయానికి వచ్చిన వారిలో ఉన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత అంతా కలిసి చంచల్‌గూడ జైలులో ఉన్న పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని కలుసుకునేందుకు వెళ్లారు.
Saturday, 16 June 2012
21న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment