వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారం, ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో ప్రస్తుతం జైల్లో ఉన్న నిందితులను సాక్షులుగా మాత్రమే విచారిస్తామని, వారికి తెలిసిన విషయాలను చెబితే చాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఈ మూడు కేసుల్లో ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, బీపీ ఆచార్య, కోనేరు ప్రసాద్, విజయరాఘవ, సునీల్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లను విచారించి వాంగ్మూలాలు నమోదు చేసేందుకు అనుమతించాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎ.పుల్లయ్య గురువారం విచారించారు.
ఈ మూడు కేసుల్లో మనీలాండరింగ్ కింద కేసులు నమోదు చేయడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని, ఈ మేరకు తమకు దర్యాప్తు జరిపే అధికారం ఉందని ఈడీ తరపున గోపాలకృష్ణ గోఖలే వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ మూడు కేసులపై ఈసీఐఆర్(ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేశామని, మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 కింద దర్యాప్తు అధికారి ఎవరికైనా సమన్లు, నోటీసులు జారీచేసి విచారణ చేపట్టవచ్చని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు జైల్లో ఉన్నందున వారిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి కోరుతున్నామని, తమ పిటిషన్‌పై నిందితుల తరపు అభ్యంతరాలు వినాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అయితే ఈడీ పిటిషన్‌పై నిందితుల తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సరైన సమాధానాలు ఇవ్వకపోతే క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారంటూ ఈడీ సమన్లలో పేర్కొందని.. ఆడిటర్లు లేకుండా ఈడీ ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెప్పాలని నిమ్మగడ్డ ప్రసాద్ తరపున న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్‌లోని నిందితుల జాబితాలో తన పేరు లేదని, అయినా తనను విచారించేందుకు అనుమతి కోరడం నిబంధనలకు విరుద్ధమని సునీల్‌రెడ్డి తరపున అశోక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును ఈనెల 19కి వాయిదా వేశారు.

No comments:
Post a Comment