వంగర మండలం లక్ష్మీపేటలో ఊచకోతకు గురైన దళితుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ శనివారం ఓదార్చనున్నారు. శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా ఆమె పరామర్శిస్తారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, నరసన్నపేట ఉప ఎన్నికల ఇన్‌చార్జి కుంభా రవిబాబు తెలిపిన వివరాల ప్రకారం విజయమ్మ పర్యటన కార్యక్రమం ఇలా ఉంది. వై.ఎస్.విజయమ్మ శనివారం ఉదయం విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడనుంచి నేరుగా ఉదయం 9 గంటలకు రణస్థలం, అక్కడనుంచి ఉదయం 9.30 గంటలకు చిలకపాలెం వస్తారు.
అనంతరం రాజాం మీదుగా 10.30 గంటలకు వంగర మండలం లక్ష్మీపేట చేరుకుంటారు. ప్రత్యర్థుల దాడిలో హతమైన నలుగురు దళితుల కుటుంబాలను ఓదారుస్తారు. 11.30 గంటలకు బయలుదేరి రాజాం, చిలకపాలెం జంక్షన్‌ల మీదుగా శ్రీకాకుళం చేరుకుంటారు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను విజయమ్మ పరామర్శిస్తారు. గతంలో వైఎస్‌ఆర్ కాంగెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో మృతి చెందిన 16 మంది కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర నిర్వహించారు. అలాగే కాకరాపల్లి, సోంపేటల్లో పోలీసు కాల్పుల్లో మృతిచెందిన వారి కుటుంబాలను ఓదార్చారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ లక్ష్మీపేట బాధితులను ఓదార్చేందుకు వస్తున్నారు.

No comments:
Post a Comment