వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి 30,555 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఉదయగిరి అసెంబ్లీ స్థానం ఆవి ర్భావం నుంచి ఇప్పటివరకూ ఎవ్వరికి రాని మెజారిటీ ఈయనకు లభించింది. ఇప్పటి వరకు ఉదయగిరి నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా చంద్రశేఖర్‌రెడ్డి రికార్డు సృష్టించారు.
ఇక వలసలే: చంద్రశేఖర్‌రెడ్డి
‘‘కాంగ్రెస్, టీడీపీలపై అటు ప్రజల్లో, ఇటు కార్యకర్తల్లో నమ్మకం సన్నగిల్లింది. అందుకే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఇక ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు వలసలబాట పట్టనున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లలో ఒక్క కార్యకర్త కూడా మిగిలే అవకాశం లేదు.
No comments:
Post a Comment