రెండో స్థానంలో టీడీపీ
కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 15,479 ఓట్ల మెజార్టీతో విజయదుందుభి మోగించారు. ఎన్నికల్లో రామకృష్ణారెడ్డికి 79,751 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి చిరుమామిళ్ళ మధు 64,272 ఓట్లు దక్కించుకున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి లక్ష్మారెడ్డి కేవలం 19,065 ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయారు. మాచర్ల నియోజకవర్గం ఆవిర్భావం అనంతరం మొదటిసారిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో డిపాజిట్లు కోల్పోయింది.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ బొత్స సత్యనారాయణతో సహా పలువురు మంత్రులు, ఎంపీలు విస్తృతంగా ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. కౌంటింగ్ ప్రారంభమైన అనంతరం ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. తొలి రౌండ్‌లోనే 1,398 ఓట్లతో మొదలైన మెజార్టీ ప్రస్థానం తుదికంటా కొనసాగింది. 9వ రౌండ్‌లో టీడీపీ 282 ఓట్లు, 11వ రౌండ్‌లో ఒక్క ఓటు, 16వ రౌండ్‌లో 162 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అటు పోస్టల్ బ్యాలెట్‌లోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవానే కొనసాగింది.
ఈ విజయం జగన్‌కు అంకితం: పీఆర్కే
నా విజయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌కే అంకితం ఇస్తున్నా. కాంగ్రెస్, టీడీపీ లు తమ పార్టీపై ఎంత బురదజల్లినా, దిగజారి నీచ ఆరోపణలు చేసినా ప్రజలు ఏమాత్రం విశ్వసించలేదు.

No comments:
Post a Comment