రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ ఘనవిజయం సాధించడంతో దేశ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగనున్నాయని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో నెల్లూరు నుంచి పార్లమెంటుకు ఎన్నికైన సందర్భంగా మేకపాటి, కోవూరు ఎమ్మెల్యే ఎన్. ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి శనివారం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ రాజమోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ఒక శక్తి అని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైసా విలువచేయని వారిని నెత్తిన పెట్టుకుని జగన్‌లాంటి ఆణిముత్యాన్ని చేతులారా పొగొట్టుకుందన్నారు. ఉప ఎన్నికలతో చంద్రబాబు పని అయిపోయిందన్నారు. జగన్ అరెస్టు తమ కొంప ముంచిందని ఢిల్లీ స్థాయి నేతలు మాట్లాడటం అరెస్టు వెనుక కుట్ర ఉందనడానికి సాక్ష్యమన్నారు.
కాంగ్రెస్‌లో ముసలం : ప్రసన్నకుమార్‌రెడ్డి
రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికలలో వైఎస్‌ఆర్ సీపీ విజయం సాధించడంతో కాం గ్రెస్ పార్టీలో ముసలం పుట్టిందని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్ సీపీ విజయంతో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వీరితో పాటు 2014 ఎన్నికలలో ఎలాగైనా తాము ఓడిపోతామని, ముందుగానే వారు తమ పార్టీలో చేరాలని భావిస్తున్నారన్నారు.
No comments:
Post a Comment