సాధారణ ఎన్నికల ఫలితాలను ఉప ఎన్నికల ఫలితాలు ప్రతిసారీ ప్రభావితం చేయాలని లేదు. అయితే ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగినవి ఒకటో రెండో సీట్లకు పరిమితమైన ఉప ఎన్నికలు కావు. ఏకంగా 18 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన మినీ జనరల్ ఎలక్షన్ అది. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు అత్యంత నిర్ణయాత్మకంగా వెలువ డింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని ఓ రికార్డు సృష్టించింది. 2014లో జరిగే సాధారణ ఎన్నికలలో కాంగెస్ పార్టీ ప్రధానంగా ఆ పార్టీ నుంచే గట్టి పోటీ ఎదు ర్కోబోతోంది. నిజానికి వెల్లువెత్తిన ఫలితాల ప్రభావానికి లోనై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ పార్టీలో పెద్దఎత్తున చేరి పోతే కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వ మనుగడకే ముప్పు.
కాంగ్రెస్ రెండంటే రెండే స్థానాల్లో గెలుపొందటం, టీఆర్‌ఎస్ పోటీ చేసిన ఒక్కస్థానాన్ని కైవసం చేసుకోవడం, టీడీపీ అన్ని స్థానాల్లో ఓడిపోవడం విశేషం. ఇటీవలి కాలం లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల రాజీనామాల ఫలి తంగా జరిగిన ఉప ఎన్నికలు కేవలం ఒక ప్రాంతానికే పరి మితం కాగా, ఈ ఉప ఎన్నికలు రాష్ట్రంలోని మూడు ప్రాం తాల్లో జరగడం మరో విశేషం. ఫలితాల సాధనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతజిల్లా కడపకు, రాయల సీమ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లో సైతం విజయపతాక ఎగురవేయడం గమనా ర్హం. గెలిచిన మొత్తం స్థానాల్లో 8 సీమ ప్రాంతానికి చెంది నవే అయినా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలోని సీట్లలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అలవోకగా విజయం సాధిం చడం చూస్తే పునాదిని విస్తరించుకునే శక్తి ఆ పార్టీకి గణనీ యంగా ఉందని తేటతెల్లమవుతున్నది. తెలంగాణలోని పరకాల స్థానంలో కూడా ఆ పార్టీ అభ్యర్థి ముఖాముఖి పోరులో టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీనిచ్చి ద్వితీయ స్థానాన్ని సొంతం చేసుకోవడం... టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు అశుభ సూచకమని చెప్పాలి.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తలమునకలై ఉం డగా అవినీతి ఆరోపణలపై జగన్‌ను అరెస్టు చేయడాన్ని ‘రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన దుస్సాహసిక చర్య’ గా ప్రజలు భావించారు. దీనికి తోడు కాంగ్రెస్, టీడీపీలు పరస్పరం దాడులు చేసుకోవడం మానేసి జగన్‌పై కలిసి కట్టుగా దాడులకు దిగడం ఊహించని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను మెరుగుపరిచింది. పాలకపక్షంగా ఉండటం వలన కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోవ టమే కాక, పెట్రోల్ ధరలు భగ్గుమనటం కేంద్రప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయకపోవడం ఆ పార్టీ అభ్యర్థు ల గెలుపుపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేజిక్కించుకోవడానికి జగన్‌పార్టీ మరికొంత దూరం ప్రయాణం చేయకతప్పదనేది వాస్తవమే అయినా, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ముందుముందు అంతా గడ్డు కాలమే. జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ పార్టీ 2014 ఎన్ని కలను ఎదుర్కోవడం అంత సులువు కాదు. లోక్‌సభకు అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ ఎంపీలను పంపిన ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతే... సంభవించే పర్య వసానాల ప్రభావం దక్కన్ పీఠభూమిని దాటుతుంది.
(‘హిందూ’ జూన్ 16 సంచికలోని సంపాదకీయం నుంచి...)
No comments:
Post a Comment