ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీకి విశ్వసనీయత లేదని ఉప ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఉప ఎన్నికల ఫలితాలు, వాటి ప్రభావం, రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిం చారు. ఈ భేటీ వివరాలను రాఘవులు విలేకరులకు వివరించారు. ‘‘రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇది కాంగ్రెస్ దుష్టపాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు. కాంగ్రెస్‌పై ప్రజల్లో రగిలిన అసంతృప్తిని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వినియోగించుకోగలిగే స్థితిలో లేదు. ఆ పార్టీకి విశ్వసనీయత లేదు’’ అని రాఘవులు వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ పరిస్థితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర్థంగా వినియోగించుకుందన్నారు. రాష్ట్రంలో ఇలాంటి అనిశ్చిత, అస్తవ్యస్త పరిస్థితులు మరికొంత కాలం కొనసాగే అవకాశాలున్నాయన్నారు.
Saturday, 16 June 2012
టీడీపీకి విశ్వసనీయత లేదు -బీవీ రాఘవులు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment