రాష్ర్టంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగం రాష్ర్ట కన్వీనర్ నాగిరెడ్డి అన్నారు. ధాన్యానికి 170 రూపాయల మద్దతు ధర పెంచామన్నది బూటకమనిన్నారు. ఈ విషయంలో ప్రధానికి, కేంద్రానికి సీఎం ధన్యవాదాలు తెలపడం ఆలోచనలేని చర్యని ఆయన ఎద్దేవా చేశారు. మద్దతు ధర పెరిగింది 90 రూపాయలు మాత్రమేననిన్నారు. అయితే ఈ ప్రభుత్వం 170 అని గొప్పలు చెప్పుకోవడం శోచనీయమన్నారు. సీఎం మోసపూరిత ప్రకటనలు మాని వాస్తవాలు చెప్పాలన్నారు. అసలు సీఎంకు రైతు సమస్యలు పట్టడం లేదని నాగిరెడ్డి వివర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment