కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ కారణంగానే తాను ఓడిపోయానని పరకాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురే్ఖ అన్నారు. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ కు ఓట్లు వేయించారని ఆమె ఆరోపించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. ఓడిపోయినందుకు తనకు బాధగా లేదన్నారు. పరకాలలో తెలంగాణవాదం పనిచేయలేదని, అభిమానమే పనిచేసిందన్నారు. తెలంగాణవాదం పనిచేసుంటే తాను గెలిచేదాన్నని చెప్పారు. తెలంగాణవాదాన్ని తాను తప్పుబట్టడం లేదన్నారు.
ప్రజలను మోసం చేసి టీఆర్ఎస్ గెలిచిందన్నారు. మూడు నెలల్లో తెలంగాణ వస్తుందని కేసీఆర్ చెబుతున్నారని, రాకపోతే భిక్షపతిని రాజీనామా చేయించే బాధ్యత ప్రజలే తీసుకుంటారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు తన వెంటే ఉన్నారన్నారు. ప్రజలు తనను విశ్వసించారు కాబట్టే తనకు ఇన్ని ఓట్లు వేశారన్నారు. ఇకపై కూడా ప్రజల్లోనే ఉంటామని సురేఖ చెప్పారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు గెలవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. నరసాపురం, రామచంద్రపురంలో తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం బాధ కలిగించిందన్నారు.

No comments:
Post a Comment