వాన్ పిక్ ప్రాజెక్టుకు భూములు సేకరించిన ఒంగోలు నియోజకవర్గ ప్రాంతంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి బారీ ఆదిక్యత రావడం విశేషంగా కనిపిస్తుంది. వాన్ పిక్ ప్రాజెక్టుకోసం భూములు సేకరించడంలో రైతులకు అన్యాయం జరిగిందని,తక్కువ పరిహారం ఇచ్చారని ఇలా రకరకాల ఆరోపణలను ఒకపక్కన సిబిఐ మరో పక్క కాంగ్రెస్ , టిడిపిలు గుప్పించాయి. ఒక ప్రముఖ పత్రిక అయితే రైతుల అభిప్రాయాలు అంటూ రోజూ వాన్ పిక్ వ్యతిరేక ప్రచారం చేపట్టింది. మంత్రి డొక్కా మాణిక్ వర ప్రసాద్ ఏరు వాక పేరుతో వాన్ పిక్ భూములలో దున్నుతున్నట్లు డ్రామా కూడా నడిపారు. చివరికి పోలింగ్ జరుగుతున్న రోజున కూడా హడావుడిగా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి వాన్ పిక్ పై సమీక్ష జరిపినట్లు, దానిని రద్దు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా ప్రచారంలో పెట్టారు. ఇంత చేసినా ప్రజలు మాత్రం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం విశేషం. ఒంగోలు నియోజకవర్గంలో ఇరవైఏడువేలకు పైగా ఆధిక్యతతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. ఏదో ఒకటి చెప్పి ప్రజలను తమవైపు తిప్పుకోవాలనుకునే క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలను కూడా రాజకీయ పార్టీలు పణంగా పెడుతున్నాయి. సిబిఐ అయితే రాజకీయ బాస్ ల ఒత్తిడికి లొంగి జగన్ ఆస్తుల కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త, వాన్ పిక్ లో భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్టు చేసింది.ఇంత చేసినా చివరికి అక్కడ జనం వీరందరికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం విశేషం.
source: kommineni
source: kommineni
No comments:
Post a Comment