రాజంపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అమర్‌నాథరెడ్డి... కాంగ్రెస్ అభ్యర్థి మేడా మల్లిఖార్జునరెడ్డిపై 38,219 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 1,46,615 ఓట్లు పోలవగా.. అమర్‌నాథరెడ్డికి 76,951 ఓట్లు లభించాయి. మల్లిఖార్జునరెడ్డికి 38,732 ఓట్లు దక్కాయి. తెలుగుదేశం అభ్యర్థి పసుపులేటి బ్రహ్మయ్య 21,417 ఓట్లు సాధించినా డిపాజిట్ గల్లంతైంది. ఇక్కడ ఐదో రౌండులో మాత్రమే మల్లిఖార్జునరెడ్డికి 45 ఓట్లు స్వల్ప ఆధిక్యత లభించింది. అలాగే పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌కు 44, ఒకటి మాత్రమే వైఎస్‌ఆర్ సీపీకి లభించాయి. ఆ రెండు మినహా అన్ని రౌండ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి హవా కనిపించింది.
కక్ష సాధింపును గమనించారు: ఆకేపాటి
‘‘నా గెలుపు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇస్తున్నా. అధికార పార్టీ ఓటర్లను అనేక రకాలుగా ప్రలోభ పెట్టినా వైఎస్సార్ కుటుంబంపై ఉన్న అభిమానాన్ని చాటుకునే విధంగా ఓటర్లు నాకు ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు’’
No comments:
Post a Comment