సానుభూతి వల్లే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనడం సరికాదని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. జగనే తమ నాయకుడని ఉపఎన్నికల ద్వారా ఓటర్లు నిరూపించారని అన్నారు. టీఆర్‌ఎస్ లక్ష్యం ఓట్లు, సీట్లేనని ఉపఎన్నికల ద్వారా నిరూపితమైందని అన్నారు. తెలంగాణలోనూ వైఎస్‌ఆర్ సీపీ బలమైన పార్టీగా ఆవిర్భవిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ బంగారుపళ్లెంలో అధికారాన్ని జగన్‌కు అప్పగించడం ఖాయమని గోనె ప్రకాశరావు ధీమాగా చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment