తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి చిరంజీవి ప్రచారం చేయడమే కారణమా? అంటే అవుననే సమాధానాలు విన్పిస్తున్నాయి. సొంత నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారంచేసిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీని ఒడ్డునపడేయలేకపోయారు. పెపైచ్చు ప్రత్యర్థికి బారీ మెజారిటీ రావడానికి కారణమయ్యారన్న భావన ఉంది. 2009 ఎన్నికల్లో 15వేల ఓట్ల మెజారిటీతో చిరంజీవి తిరుపతి నుంచి గెలుపొందారు. ఇప్పుడు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు కాబట్టి ఓటు బ్యాంకు పెరగాలి. కానీ ఉప ఎన్నికలో ఫలితం ఇందుకు భిన్నంగా వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి 18117 ఓట్లతో ఘన విజయం సాధించారు.
అయితే చిరంజీవి ప్రచారమే కొంపముంచిందని కాంగ్రెస్ నేతలు కుమిలిపోతున్నారు. మెగాస్టార్ ప్రచారం చేయకుంటే రామచంద్రపురం, నర్సాపురం గెలిచినట్టే తిరుపతిని దక్కించుకునేవారిమని వాపోతున్నారు. రామచంద్రపురంలో చిరంజీవి ప్రచారం చేయని సంగతి తెలిసిందే. ఇక నర్సాపురంలో ప్రచారం చేసినప్పటికీ తనపై పూర్తి వ్యతిరేకత ఉన్న సొంతూరు మొగ ల్తూరుకు మొహం చూపించకుండానే వచ్చేశారు. అయితే చిరు సెంటిమెంట్‌తో పాటు కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో అధికారపార్టీకి లాభించిందన్నది బహిరంగ రహస్యం.

No comments:
Post a Comment